గుండు కొట్టించుకొని నటిస్తానన్న ఏకైక అందాల హీరోయిన్ ఆమె!

సాధారణంగా సినిమాలలో హీరోయిన్ లు అందంగా కనిపించాలనీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే వారి అందం రెట్టింపు అవ్వడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందంగా కనిపించాలంటే తప్పనిసరిగా జుట్టు ఉండటం ఎంతో అవసరం.

 Bollywood Actress Katrina Kaif Ready To Act With Bald Head In Challenging Roles-TeluguStop.com

ఈ జుట్టు వల్ల అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు.ఇకపోతే హీరోయిన్ల విషయంలో జుట్టుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

వివిధ రకాల హెయిర్ స్టైల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారినీ సందడి చేయడానికి సిద్ధం అవుతారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క హీరోయిన్ బాగా జుట్టును పెంచుకోవడమే కాకుండా జుట్టుకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు.

ఇలా మేకప్ విషయంలో హీరోయిన్లు మాత్రం వెనకడుగు వేయరు.అయితే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ చేయడం వల్ల వీరు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనకాడరు.

ఒక పాత్ర అద్భుతంగా ఉంది అంటే ఆ పాత్రలో నటించడం కోసం మేకప్ లేకుండా కూడా తెరమీద ప్రేక్షకులకు కనిపించడానికి సిద్ధమవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు.ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్స్ ఇలా డి గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే ఏకంగా ఒక హీరోయిన్ మాత్రం తనకుపాత్ర నచ్చితే ఎలా అయినా నటించడానికి తాను సిద్ధమేనని ఏకంగా గుండు కొట్టించుకొని అయినా కూడా ఆ పాత్రలో నటిస్తున్నానని ఓ ముద్దుగుమ్మ వెల్లడించారు.

Telugu Bald, Interview, Katrina Kaif, Ready, Tollywood, Vicky Kaushal-Movie

ఇలా గుండుతో అయిన సినిమాలలో నటిస్తానని చెప్పిన హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే…మల్లీశ్వరి సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె మల్లీశ్వరి సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే తనకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని, వెల్లడించడంతో అది గుండు పాత్రలోనైనా నటిస్తారా అని ప్రశ్న ఎదురైంది.

Telugu Bald, Interview, Katrina Kaif, Ready, Tollywood, Vicky Kaushal-Movie

ఇలాంటి ప్రశ్న తనకి ఎదురైనప్పుడు కత్రినాకైఫ్ ఏ మాత్రం ఆలోచించకుండా పాత్ర డిమాండ్ చేస్తే గుండు కొట్టించు కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఒక సందర్భంలో ఈ విషయాన్ని ఈమె వెల్లడించారు.అయితే ఎప్పుడు కత్రినా కైఫ్ కి ఈ విధమైనటువంటి అవకాశాలు రాలేదనే చెప్పాలి.ఇక మల్లీశ్వరి సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమైన కత్రినాకైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె పలువురు హీరోలతో లవ్ ఎఫైర్స్ కొనసాగిస్తూ చివరికి తాను ప్రేమించిన వ్యక్తి విక్కీ కౌశల్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube