ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం సులభం కాదు.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం తొలి సినిమాతోనే అందం, అభినయం ఉన్న నటిగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటారు.అలా తెలుగులో తొలి సినిమాతోనే గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు.2004 సంవత్సరంలో విడుదలైన మల్లీశ్వరి సినిమాతో కత్రినా కైఫ్ తెలుగుతెరకు పరిచయమయ్యారు.

 Bollywood Actress Katrina Kaif Childhood Photo Goes Viral In Social Media , Katr-TeluguStop.com

మల్లీశ్వరి సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించిన కత్రినా ఆ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అల్లరిపిడుగు సినిమాలో నటించారు.అయితే అల్లరిపిడుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తరువాత టాలీవుడ్ కు దూరమైన కత్రినా బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ చిన్నప్పటి ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో కత్రినా రెండు జడలు వేసుకుని క్యూట్ గా కనిపిస్తున్నారు.కత్రినా కైఫ్ కెరీర్ లో ఎన్నో కమర్షియల్ సక్సెస్ లు ఉండగా గత కొన్నేళ్ల నుంచి కత్రినాకు హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

కత్రినా తల్లి బ్రిటన్ దేశానికి చెందిన వారు కాగా ఆమె తండ్రి కశ్మీరి.కత్రినా తల్లి లాయర్ కాగా తండ్రి బిజినెస్ మేన్.కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో పాటు సోషల్ మీడియా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Telugu Childhood, Katrina Kaif, Mallishwari, Venkatesh-Movie

తల్లి ఇంటిపేరునే పేరుకు ముందు పెట్టుకున్న కత్రినా తండ్రి ఇంటి పేరు కైఫ్ ను పేరు చివరలో చేర్చుకున్నారు.కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన కత్రినా ఆ సాంగ్స్ ద్వారా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.ఆఫర్లు వస్తే కత్రినా కైఫ్ తెలుగు సినిమాల్లో నటిస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube