2023 కి కత్రినా కైఫ్ ఎన్ని సినిమాలను విడుదల చేయబోతోంది ?

బాలీవుడ్ లో పెళ్లయిన హీరోయిన్స్ కి యమ డిమాండ్ ఉంది.మరీ ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

 Bollywood Actress Katrina Kaif Busy With Movies,katrina Kaif ,tiger 3,shahrukh K-TeluguStop.com

కత్రినా కైఫ్ వంటి హీరోయిన్ కి చాలా క్రేజ్ ఉంటుంది.మరి ఆమె 2023లో ఎలాంటి సినిమాల్లో నటించబోతోంది ? ఆమె డైరీలో డేట్స్ ఎవరికి ఉన్నాయి? ఎన్ని రిలీజ్ లు జరుగుతున్నాయి ? ఆడియన్స్ ముందుకి ఎన్ని సార్లు రాబోతుంది ? అనే విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.వాస్తవానికి కత్రినా కైఫ్ కి 2023 ఫుల్ బిజీ ఏడాదిగా పరిగణించవచ్చు.ఆమె చేతిలో ప్రస్తుతం అనేక సినిమాలు ఉన్నాయి.

Telugu Alia Bhatt, Bollywood, Jee Le Zara, Katrina Kaif, Katrina, Priyanka Chopr

మొదటిగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 చిత్రంలో కత్రినా హీరోయిన్ గా నటిస్తోంది.సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్న యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కిస్తున్నారు.పఠాన్ సినిమా ద్వారా వీరికి ఈ మధ్యనే మంచి సక్సెస్ తమ ఖాతాలో పడింది.టైగర్ త్రీ సినిమాలో కత్రినా స్పై పాత్రలో నటిస్తున్నట్టుగా తెలియవస్తోంది.అంతేకాదు షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ లో కూడా కనిపించనున్నాడు.విజయ్ సేతుపతి హీరోగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఈ ఏడాది క్రిస్మస్ కి ఓ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా గ్రేషేడ్స్ ఉన్న పాత్రను చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Telugu Alia Bhatt, Bollywood, Jee Le Zara, Katrina Kaif, Katrina, Priyanka Chopr

ఇక కత్రినా కైఫ్ ప్రియాంక చోప్రా ఆలియా భట్ కలిసి నటిస్తున్న సినిమా జీ లే జరా.ఈ సినిమా సైతం ఈ ఏడాదే విడుదలకు సన్నద్ధమవుతోంది. ముగ్గురు అమ్మాయిలు రోడ్ ట్రిప్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.2011లో జో యాక్టర్ తీసినటువంటి జిందగీ నా మిలేంగే దుబారా అనే సినిమాకి దగ్గరలో ఉంటుంది జీ లే జరా.దీంతో కత్రినాకు ఈ మూడు సినిమాలు ఒక ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మూడింటిలో ఏ చిత్రం హిట్ అయినా కూడా మరో రెండు మూడేళ్ల పాటు కత్రినాకు డోకా ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube