ఇప్పటి స్టార్ట్ హీరోయిన్ మొదటి సినిమా అవకాశం కోసం.. అది కూడా చిన్న రోల్ మాత్రమే...

తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “ఏక్ నిరంజన్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ “కంగనా రనౌత్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే టాలీవుడ్ లో ప్రభాస్ వంటి స్టార్ హీరోతో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ బాలీవుడ్ పై ఉన్నటువంటి మక్కువ కారణంగా హిందీ సినిమా పరిశ్రమకు వెళ్ళిపోయింది.

 Bollywood Actress Kangana Ranaut Reply To The Jaya Bachchan Comments In Social Media-TeluguStop.com

దీంతో కంగనా కి బాలీవుడ్ లో కూడా బాగానే అవకాశాలు తలుపు తట్టడంతో ప్రస్తుతం ఈ అమ్మడు టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.కానీ ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది.

కాగా ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో భార్య కంగనా రనౌత్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా “అన్నం పెట్టిన కంచంలోనే ఉమ్మేసేవాళ్ళు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో కంగనా రనౌత్ తనదైన శైలిలో ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీ తనకేమి “బంగారు కంచంలో భోజనం వడ్డించలేదని” తన భోజనాన్ని తానే సొంతంగా కష్టపడి సంపాదించుకున్నానని ఘాటుగా సమాధానం ఇచ్చింది.

 Bollywood Actress Kangana Ranaut Reply To The Jaya Bachchan Comments In Social Media-ఇప్పటి స్టార్ హీరోయిన్ మొదటి సినిమా అవకాశం కోసం.. అది కూడా చిన్న రోల్ మాత్రమే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ సన్నివేశాలు వంటి పాత్రలను మాత్రమే ఆఫర్ చేశారని కానీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు చాలా సమయం పట్టిందని ఎమోషనల్ అయ్యింది.దీంతో కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా బాలీవుడ్ లో గత ఏడాది ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి నటి కంగనా రనౌత్ బాలీవుడ్ సినిమా పరిశ్రమలో నేపోటిజం ను పెకలించి వేయాలని ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల నుంచి నిట్టూర్పులు మరియు పలు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది.

కాగా నటి కంగనా రనౌత్ ఇటీవలే తమిళం భాషలో “తలైవి” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల చేయగా సినీ విశ్లేషకుల నుంచి మంచి విమర్శలు అందుకుంది.ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్ లో “ధకడ్” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ప్రస్తుతం ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Kangana Ranaut #Jaya Bachchan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు