ఈ హీరోయిన్  చిన్న వయసులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందట... కానీ... - Bollywood Actress Jiah Khan Death News

Bollywood actress jiah khan death news, Bollywood actress, jiah khan, jiah khan death, jiah khan commits suicide news, Bollywood - Telugu Bollywood, Bollywood Actress, Bollywood Actress Jiah Khan Death News, Jiah Khan, Jiah Khan Commits Suicide News, Jiah Khan Death

సినిమా పరిశ్రమకి వచ్చీరావడంతోనే స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, అనుకోకుండా తెరమరుగైన నటీనటులు ఎందరో ఉన్నారు.అయితే ఇందులో కొందరు ప్రాణాలతో లేకపోగా మరికొందరు మాత్రం ఇతర వ్యాపారాలు అలాగే కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ సినిమా పరిశ్రమకు దూరంగా గడుపుతున్నారు.

 Bollywood Actress Jiah Khan Death News-TeluguStop.com

కాగా 2007వ సంవత్సరంలో ప్రముఖ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన “నిశ్శబ్ద” అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన నటి “జియా ఖాన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చీరావడంతోనే నటి జియా ఖాన్ రామ్ గోపాల్ వర్మ మరియు అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, తదితర స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ఏమైందో ఏమో గాని 2013వ సంవత్సరంలో నటి జియా ఖాన్ జూన్ 3వ తారీకున ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది.

 Bollywood Actress Jiah Khan Death News-ఈ హీరోయిన్  చిన్న వయసులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందట… కానీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అప్పట్లో పోలీసులు తెలిపిన వివరాల మేరకు నటి జియా ఖాన్ సినిమా అవకాశాలు లేక మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

కానీ ఇప్పటి వరకు ఆమె ఆత్మహత్య వెనుక దాగి ఉన్న నిజాలు గురించి పోలీసులుగానీ   అటు కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

దీంతో ఇప్పటికీ ఆమె మరణం రహస్యంగానే మిగిలిపోయింది.అయితే గతంలో సీనియర్ నటి దివ్య భారతి కూడా తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.కానీ ఇప్పటి వరకు ఈమె ఆత్మహత్య వెనుక కూడా దాగి ఉన్న నిజాలు కూడా బాహ్య ప్రపంచానికి తెలియలేదు.

ఈ విషయం ఇలా ఉండగా నటి జియా ఖాన్ బాలీవుడ్లో “నిశ్శబ్ద, గజినీ, హౌస్ ఫుల్” తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

ఎంతో నటన ప్రతిభ ఉన్నటువంటి నటి జియా ఖాన్ అనుకోకుండా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె సినీ కెరీర్ తో పాటు మొత్తం జీవితమే నాశనం అయింది.ఏదేమైనప్పటికీ ఓ బలహీన క్షణంలో తీసుకున్నటువంటి నిర్ణయమే ఆమె మరణానికి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#Jiah Khan Death #Jiah Khan #JiahKhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు