పాపం.. ఈ హీరోయిన్ అయిందని బంధువులు దారుణంగా...

సినిమా అనేది రంగుల ప్రపంచం.ఈ ప్రపంచంలోకి వచ్చేటువంటి వారికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోయినప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతే మాత్రం ఎక్కువ కాలం ఈ ప్రపంచంలో మనుగడ సాగించలేరు.

 Bollywood Actress Hina Khan Facing Problems From Her Relatives, Hina Khan, Bolly-TeluguStop.com

ఇందులో చాలా మంది సినీ నటినటులు ఎలాంటి సినీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పటికీ స్టార్ హీరోలుగా ఎదిగారు.అంతేకాకుండా ప్రముఖ దర్శక నిర్మాతల వారసులుగా పరిచయమైన వాళ్లు కూడా రాణించలేక తెరమరుగయ్యారు.

కొంత మందయితే తమ పిల్లలను సినిమా పరిశ్రమకి పంపించాలంటే అభ్యంతరాలను తెలుపుతున్నారు.ఇలాంటి అభ్యంతరాలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ హీరోయిన్ హీనా ఖాన్ ఒకరు.

ఈమె ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన “హ్యాక్డ్” అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయింది.అంతకుముందే దాదాపుగా పదికిపైగా ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

ముఖ్యంగా హీనా ఖాన్ నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో హీనా ఖాన్ పాల్గొని తాను సినిమా పరిశ్రమకి రావడానికి ముందు ఎదుర్కున్న సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

Telugu Bollywood, Hacked, Hina Khan, Unlock-Movie

తాను కాశ్మీర్ పరిసర ప్రాంతానికి చెందిన మహిళనని అందువల్ల తన కుటుంబ సభ్యులు చాలా పద్ధతిగా పెంచారని తెలిపింది.దాంతో తాను నటనపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుసుకున్న తన తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు రావడానికి అంగీకరించలేదని చెప్పుకొచ్చింది.అనంతరం తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ముంబై కి వచ్చానని ఆ తరువాత సినిమా అవకాశాల కోసం బాగానే ఎదురు చూశానని తెలిపింది.

ఈ క్రమంలో తాను సినిమా పరిశ్రమలో పని చేస్తున్నానని తెలిసిన తన బంధువులు తమ తల్లిదండ్రులను దారుణంగా అవమానించారని దాంతో కొంత కాలంగా తన తల్లిదండ్రులకు మరియు బంధువులకు దూరంగా ఉంటున్నానని తెలిపింది.

ఒకసారి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అవమానాలు, కష్టాలు ఎదుర్కోవడం తప్పదని చెప్పుకొచ్చింది.అలాగే తాను ఇటీవలే నటించిన “హ్యాక్డ్” చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తానని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ నాటకం బాలీవుడ్లో బాగా పాపులర్ అయినటువంటి నాగిని5 ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే బిగ్ బాస్ 14వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.

కాగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ వెబ్ సిరీస్ లో హీనా ఖాన్ కొంతమేర బోల్డ్ గా కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube