సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ ని అసభ్యకరంగా తాకిన ఫ్యాన్...

మామూలుగా ఎక్కడైనా  సినీ సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకులు ఏదైనా వేడుకలు లేదా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటివాటి కోసం బయటకి వస్తే వారిని చూసేందుకుగాను అభిమానులు ఎగబడటం మనం తరచూ చూస్తుంటాం… దీంతో కొందరు సినీ నటీనటులతో సెల్ఫీలు మరియు ఫోటోలు తీసుకోవడం కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు.ఈ క్రమంలో అప్పుడప్పుడు తొక్కల తొక్కిసలాటలు కూడా జరుగుతుంటాయి.

 Bollywood Actress Deepika Padukone Facing Inconvenience In Public-TeluguStop.com

అయితే తాజాగా భోజనం చేయడానికి ఒంటరిగా బయటకు వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కి తన అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైన సంఘటన ముంబైలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న “దీపికా పదుకొనే” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Bollywood Actress Deepika Padukone Facing Inconvenience In Public-సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ ని అసభ్యకరంగా తాకిన ఫ్యాన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే దీపికా పదుకొనే కేవలం బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా పలు చిత్రాలలో నటించి తన నటనా ప్రతిభతో కట్టి పడేసింది. అయితే తాజాగా దీపికా పదుకొనే ఒంటరిగా ముంబైలో ఉన్నటువంటి ఓ ప్రముఖ హోటల్ కి భోజనం చేయడానికి వచ్చింది.

 దీంతో ఆమెను కొందరు అభిమానులు గుర్తించారు.అంతేగాక ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

ఈ క్రమంలో ఓ అభిమాని కొంతమేర అసభ్యకరంగా ఆమెను తాకుతూ ఆమె ధరించిన బ్యాగ్ కూడా పక్కకి లాగేసింది.దీంతో ఇది గమనించిన దీపికా పదుకొనే సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని అది ఆస్వాదించేందుకు బయటకు వచ్చిన వారితో ఇలా ప్రవర్తించడం సరికాదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దీపికా పదుకొనే తెలుగులో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రంలో నటించేందుకుగాను ఆర్టిస్టుల కోసం ఆడిషన్ కాల్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అలాగే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరేకేక్కిస్తున్న “పఠాన్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Mumbai #DeepikaPadukone #Prabhas #Nag Ashwin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు