అవును నేను చాలాసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను...

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలలో మరియు వెబ్ సిరీస్ లలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి “అన్వేషి జైన్” గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో కొంత కాలం పాటు మోడలింగ్ రంగంలో పని చేసింది.

 Bollywood Actress Anveshi Jain Funny Reply To Thenetizen Question-TeluguStop.com

ఆ తర్వాత ప్రముఖ ఓటిటి అయిన “ఆల్ట్ బాలాజీ” లో ప్రసారమయ్యే “గంధీ బాత్” అనే వెబ్ సిరీస్ లో నటించి బాగానే ఆకట్టుకుంది.దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ బాగానే పెరిగింది.

అంతేకాకుండా పలు చిత్రాలలో నటించే అవకాశాలు కూడా బాగానే తలుపు తట్టాయి.

 Bollywood Actress Anveshi Jain Funny Reply To Thenetizen Question-అవును నేను చాలాసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ మధ్య కాలంలో నటి అన్వేషి జైన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి సెల్ఫ్ డిఫెన్స్ మరియు మహిళలు ఎలా ప్రవర్తిస్తారనే విషయంపై పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ క్రమంలో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీ లవ్ బ్రేకప్ అయిందా…?” అని అడిగాడు.దీంతో అన్వేషి జైన్ ఒక్కసారి కాదు చాలా సార్లు లవ్ బ్రేకప్” అయిందని అంటూ రిప్లై ఇచ్చింది.

అలాగే మరో నెటిజన్ అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన “రాజ్ కుంద్రా” గురించి స్పందించాలని కోరగా ప్రస్తుతం రాజ్ కుంద్రా కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని కాబట్టి ఈ విషయంపై తాను స్పందించలేనని తేల్చి చెప్పింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అంతే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.కాగా ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో “కమిట్మెంట్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రానికి టాలీవుడ్ లో నూతన దర్శకుడు “లక్ష్మీకాంత్ చెన్న” దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు ఓపెన్ లో లేకపోవడంతో చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపి వేశారు.

#Anveshi Jain #Anveshi Jain #Love Breakups

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు