పాపం... సుశాంత్ మాజీ ప్రియురాలు శుభమా అని పెళ్లి చేసుకోబోతుంటే కొందరు దారుణంగా...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో కొందరు తమ హావ భావాలను వీటి ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు.అయితే మరికొంత మంది మాత్రం ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని కొందరు సినీ సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు.

 Bollywood Actress Ankita Lokhande Say Sorry To Her Fiancé Vicky Jain In Instagr-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మాజీ ప్రియురాలు “అంకిత లోఖండే” తానూ పెళ్లి చేసుకోబోయే  వరుడు విక్కీ జైన్ గురించి తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలియజేసింది.

దీంతో కొందరు అభిమానులు విక్కీ జైన్ అంకిత లోఖండే సరైన జోడి కాదని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేగాక కొంతమంది అతడి గురించి కొంతమేర అసభ్యకరంగా నెగిటివ్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ విషయంపై అంకిత లోఖండే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.

 ఇందులో భాగంగా తాను విక్కీ జైన్ కలిసి తీసుకున్న ఓ ఫోటోని షేర్ చేసింది. అంతేగాక విక్కీ జైన్ చాలా మంచివాడని అలాగే మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి తనకు భర్త అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

విక్కీ జైన్ తన లాంటి పబ్లిక్ ఫిగర్ తో ఉండడం వల్లే అతడు ఇలాంటి ఇబ్బందులను సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్నాడని అందుకు క్షమాపణలు కూడా చెప్పింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా హిందీలో అంకిత లోఖండే ప్రస్తుతం పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

 అంతేగాక ఇటీవలే పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం దక్కించుకొని  వరుస షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా గడుపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube