ఫైటర్ తో రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్...

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నడుస్తున్న టువంటి చిత్రం “ఫైటర్”.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

 Bollywood Actress Ananya Pandey Joining In Fighter Movie Shooting-TeluguStop.com

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే నటిస్తోంది.అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్, ఈ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించినటువంటి కొన్ని వర్కింగ్ ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు.ఇందులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో అనన్య పాండే షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుని రూమ్ లో కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.దీంతో విజయ్ దేవరకొండ మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ముంబై నగరంలో ఉన్నటువంటి పలు లొకేషన్లలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు బిజీ బిజీగా గడుపుతున్నారు.అలాగే చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Telugu Ananya Pandey, Ananyapandey, Fighter, Fightervijay-Movie

అయితే తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రం అం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా ఫైటర్ చిత్రంతో హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు.అందుకుగాను తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube