ఈ స్టార్ హీరోయిన్ అక్క ప్రొడ్యూసర్ అని మీకు తెలుసా...?

బాలీవుడ్లో ఒకప్పుడు ఆషికి, సాథి, మర్డర్, సడక్, క్రిమినల్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మహేష్ భట్ వైవిద్య భరితమైన ప్రేమ కథా చిత్రాలతో పాటూ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలను కూడా  తెరకేకించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.

 Bollywood Star Actress Alia Bhatt Sister Pooja Bhatt Movie Offers And Parents Ne-TeluguStop.com

కాగా మహేష్ భట్ 19970 వ సంవత్సరంలో కిరణ్ భట్ అనే మహిళ ని పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరికీ పూజా భట్ తో పాటూ మరో ముగ్గురు సంతానం.

ఆ తర్వాత 1986వ సంవత్సరంలో సోనీ రాజధా అనే బాలీవుడ్ ప్రముఖ నటి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరికీ ఆలియా భట్ జన్మించింది.

దీంతో మహేష్ భట్ తమ వారసులుగా ఆలియా భట్, పూజా భట్ లను నటీనటులుగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.

అయితే ఇందులో ఆలియా భట్ గురించి ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్ లో తెలియనివారుండరు.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నఆర్.ఆర్.ఆర్ అనే చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది.ఇటీవలె ఈ అమ్మడికి పాత్ర కి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

ఇక ఆలియా భట్ సోదరి పూజా భట్ టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే తెలిసే ఉంటుంది.ఈ అమ్మడు అప్పట్లో సంజయ్ దత్, గోవింద్, అమితాబ్ బచ్చన్, తదితర స్టార్ హీరోలతో నటించింది.

అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలకి సహా నిర్మాతగా కూడా వ్యవహరించింది.

Telugu Alia Bhatt, Bollywood, Bombay Begum, Mahesh Bhatt, Pooja Bhatt, Rajamouli

కాగా ఇటీవలే పూజా భట్ హిందీలో “బాంబే బేగం” అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్దికాలంగా అలియా భట్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పటివరకు ఆలియాభట్ మాత్రం తన పెళ్లిపై వినిపిస్తున్న వార్తల గురించి స్పందించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube