టీవిల్లో ఆడ్స్ వస్తూవుంటాయి, ఒక అబ్బాయి ఎదో ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని బయలుదేరతాడు.చుట్టుపక్కల ఉన్న అందమైన అమ్మాయిలంతా ఆ పర్ఫ్యూమ్ వాసనకి ఆకర్షితులై అతని వెంటపడుతుంటారు.
ఇలాంటి ఆడ్స్ ఆలియా భట్ లాంటి అమ్మాయిలను చూసే కావచ్చు రూపొందించి ఉంటారు.ఎందుకంటే అలియా కుడా అబ్బాయిల పర్ఫ్యూమ్ కి పడిపోతుందట.ఇంకా చెప్పాలంటే అబ్బాయిలు వాడే అత్తరు బాటిల్లనే వాడుతుందట.
“అందరూ తన లవర్ అందంగా ఉండాలి, అర్థం చేసుకునేవాడై ఉండాలి అని చెబుతుంటారు కదా! నాకు మాత్రం నా లవర్ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి.మంచి వాసన నన్ను వెంటనే అట్రాక్ట్ చేస్తుంది.అబ్బాయిల విషయంలో కూడా నేను త్వరగా పడిపోయేది దానికే.ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను ఎప్పుడూ మగాళ్ల పర్ఫ్యూమ్సే వాడతాను.పైగా నెలకొకటి మారుస్తుంటాను! ” అంటూ తన చిత్రమైన అలవాటుని బయటపెట్టింది ఆలియా.
ఇంకేం మరి అబ్బాయిలు, వెంటనే మాంచి పర్ఫ్యూమ్ కొట్టేసుకొని ఆలియాను పడేయండి.