జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో మీకు తెలుసా?

Bollywood Actors Who Have Been In Jail

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే.ఆర్యన్ బెయిల్ పిటిషన్ నిన్న మరోసారి తిరస్కరణకు గురైంది.

 Bollywood Actors Who Have Been In Jail-TeluguStop.com

కొడుకుకు బెయిల్ వస్తుందని షారుఖ్ ఖాన్ భావించగా ఎన్సీబీ అధికారులు ఇచ్చిన ట్విస్ట్ వల్ల ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాలేదు.ఆర్యన్ ఖాన్ తన చాటింగ్ లో ఒక హీరోయిన్ తో డ్రగ్స్ గురించి చర్చించారు.

మరోవైపు కొందరు డ్రగ్స్ సరఫరాదారులతో ఆర్యన్ ఖాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 Bollywood Actors Who Have Been In Jail-జైలు శిక్ష అనుభవించిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్యన్ తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరికి సైతం కోర్టు బెయిల్ ను నిరాకరించడం గమనార్హం.

ఆర్యన్ ఖాన్ ఈ నెల 3వ తేదీన అరెస్ట్ కాగా అప్పటినుంచి ఆర్యన్ ఖాన్ రిమాండ్ లోనే ఉండటం గమనార్హం.ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన హీరోయిన్ ఎవరనే చర్చ కూడా బాలీవుడ్ లో జోరుగా జరుగుతోంది.అయితే గతంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జైలు శిక్షను అనుభవించారు.

1998 సంవత్సరంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యారు.

Telugu Aryan Khan, Bollywood Actors, Fardeen Khan, Firoj Khan, Interesting Facts, Raj Kundra, Ria Chakraborthy, Salman Khan, Sanjay Dutt, Sonali Bindre, Who Have Been In Jail-Movie

ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారనే విషయం తెలిసిందే.1993 సంవత్సరంలో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ జైలుపాలయ్యారు.2001 సంవత్సరంలో ఫిరోజ్ ఖాన్ కొడుకు ఫర్దీన్ ఖాన్ డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడటం గమనార్హం.

Telugu Aryan Khan, Bollywood Actors, Fardeen Khan, Firoj Khan, Interesting Facts, Raj Kundra, Ria Chakraborthy, Salman Khan, Sanjay Dutt, Sonali Bindre, Who Have Been In Jail-Movie

ప్రముఖ నటి సోనాలి బింద్రే మతాన్ని కించరించారనే ఆరోపణలతో జైలుపాలయ్యారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.ఈ నటి నెలరోజుల పాటు జైలుశిక్షను అనుభవించారు.

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ హీరోగా పేరును సొంతం చేసుకున్న షైనీ ఆహుజా పనిమిషిని అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు.

#Raj Kundra #Chakraborthy #Firoj Khan #Fardeen Khan #Aryan Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube