హీరోయిన్ రష్మిక పేరు చెప్పి భారీ మోసం.. బాలీవుడ్ యాక్టర్స్ నయా దందా?

Bollywood Actors Arrested In Hyderbad Use Rashmika Name Details, Rashmika Mandanna, Bollywood, Tollywood, Hyderabad, Apoor Aswin, Natasha Kapoor, Cyberabad Police, Cheating Case, Heroine Rashmika Mandana, Cosmopolitan Modelling

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల మోసాలు జరుగుతూ ఉంటాయి.మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలి అక్కడ స్థిరపడాలి అనుకున్న కొందరు అమాయకులను మేము సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళతో పరిచయం చేస్తాం వీళ్లకు పరిచయం చేస్తాము అని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటారు.

 Bollywood Actors Arrested In Hyderbad Use Rashmika Name Details, Rashmika Mandan-TeluguStop.com

ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.అమాయకులను మోసం చేయడానికి ఎప్పుడూ కొందరు సిద్ధంగా ఉంటారు.

తాజాగా కూడా హైదరాబాదులో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాన్ ఇండియా ముద్దుగుమ్మ రష్మిక మందన్న పేరు చెప్పి ఒక వ్యక్తిని మోసం చేశారు.

చిన్న మోడలింగ్ లో ట్రైనింగ్ ఇచ్చి, సినిమా ఛాన్సలు ఇప్పిస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.బాలీవుడ్ యాక్టర్స్ అయిన వారిని అపూర్ అశ్విన్, నటాషా కపూర్ గా గుర్తించారు.

Telugu Apoor Aswin, Bollywood, Cosmopolitan, Cyberabad, Hyderabad, Natasha Kapoo

ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని వీళ్లు చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా రన్ చేస్తున్న ఈ ఇద్దరూ తమ బుట్టలో పడిన ఓ వ్యాపారవేత్తను సైతం బురిడి కొట్టించారు.ఆయన దగ్గర నుంచి ఏకంగా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Apoor Aswin, Bollywood, Cosmopolitan, Cyberabad, Hyderabad, Natasha Kapoo

రోజులు గడుస్తున్నా సరే వారి నుంచి ఎలాంటి కబురు లేకపోవడంతో సదరు వ్యాపారవేత్తకు సీన్ అర్థం అయ్యి వెంటనే తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే వీరికి నిజంగానే హీరోయిన్ రష్మిక తో సంబంధం ఉందా లేకపోతే రష్మిక మందన పేరు చెప్పి వీరు మోసాలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube