ఇతడు ఇక్కడ విలన్ కానీ.. అక్కడ మాత్రం స్టార్ హీరో...

తెలుగులో ఇక దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన “శక్తి” అనే చిత్రంలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు విద్యుత్ జమాన్వాల్  గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే విద్యుత్ జమాన్వాల్ మొదట విలన్ గా సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ క్రమక్రమంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని హీరోగా అవకాశాలు కూడా దక్కించుకుని ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.

 Bollywood Actor Vidyut Jamwal Debut Movie And Career News, Vidyut Jamwal, Telugu-TeluguStop.com

కాగా విద్యుత్ జమాన్వాల్ హీరోగా నటించిన “కమాండో” చిత్రం బాలీవుడ్లో మంచి విజయం సాధించింది.దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా విడుదలైన టువంటి మరో మూడు చిత్రాలు కూడా ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.

అయితే కండలు తిరిగిన దేహం, నటనా ప్రతిభ, వంటివి మెండుగా ఉండటంతో విద్యుత్ జమాన్వాల్ ప్రస్తుతం బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకున్నాడు.అయితే విద్యుత్ జమాన్వాల్  పారితోషికం విషయంలో కూడా దాదాపుగా 25 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆ మధ్య విద్యుత్ జమాన్వాల్ మరియు తమిళ ప్రముఖ హీరో సూర్య కలిసి నటించిన సికిందర్ చిత్రం కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.దీంతో విద్యుత్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే యూట్యూబ్ విద్యుత్ జమాన్వాల్ ఎప్పుడూ తన నటనా ప్రతిభ మెరుగు పరుచుకుంటూ ఫిట్ నెస్ ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు పలు వీడియోలను కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నాడు.ప్రస్తుతం విద్యుత్ జమాన్వాల్ అధికారిక ఇంస్టాగ్రామ్ కాదని దాదాపుగా 57 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య విద్యుత్ జమన్వాల్ బాలీవుడ్లో “ఖుదాఫీస్” చిత్రంలో హీరోగా నటించాడు కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం లో విడుదల చేశారు.ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

కాగా ప్రస్తుతం విద్యుత్ జమాన్వాల్ హిందీలో “సనక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

కాగా ఈ రుక్మిణీ మైత్రా, నేహా దుపియా, చందన్ రాయ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube