చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనం చేస్తూ పట్టుబడిన సీరియల్ నటుడు...- Bollywood Actor Vaibhav Jadhav Arrested In Chain Snatching Case

Bollywood actor Vaibhav Jadhav arrested in chain snatching case, Vaibhav Jadhav arrested, Bollywood actor, Vaibhav Jadhav, Bollywood, - Telugu Bollywood, Bollywood Actor, Bollywood Actor Vaibhav Jadhav Arrested In Chain Snatching Case, Vaibhav Jadhav, Vaibhav Jadhav Arrested

మద్యపానం, దొంగతనం, జూదం, బెట్టింగ్, వంటి వ్యసనాలు మానవ జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయని తెలిసినప్పటికీ కొందరు ఈ అలవాట్లను కంట్రోల్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కాగా పలు సీరియళ్లలో నటించిన సీరియల్ నటుడు క్రికెట్ బెట్టింగ్ కి అలవాటు పడి లక్షల రూపాయలు అప్పులు చేసి చివరికి అప్పులు తీర్చడానికి దొంగగా మారిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

 Bollywood Actor Vaibhav Jadhav Arrested In Chain Snatching Case-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే 28 ఏళ్లు నిండిన ఓ యువకుడు స్థానిక రాష్ట్రంలోని సూరత్ పట్టణ పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడికి నటనపై ఆసక్తి ఉండడంతో పలు ధారావాహికలలో చిన్న చిన్న పాత్రలో కూడా నటించాడు.

కాగా ఈ మధ్య కాలంలో ఈ సీరియల్ నటుడు క్రికెట్ బెట్టింగులకి బాగా అలవాటు పడ్డాడు.

 Bollywood Actor Vaibhav Jadhav Arrested In Chain Snatching Case-చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనం చేస్తూ పట్టుబడిన సీరియల్ నటుడు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తెలిసిన బంధువులు మరియు స్నేహితుల వద్ద దాదాపుగా ఇరవై లక్షల రూపాయలకి పైగా అప్పులు చేశాడు.

కానీ ఈ బెట్టింగులలో మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు దీంతో చేసిన అప్పులను తీర్చడానికి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి దొంగతనం చేస్తుండగా పోలీసులకు చిక్కాడు.

దీంతో పోలీసుల విచారణలో సీరియల్ నటుడు తాను చేసినటువంటి అప్పులను తీర్చుకోవడానికి మరియు ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తనను దొంగగా మారాల్సి వచ్చిందని నేరం అంగీకరించాడట.దీంతో పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని జూదం, క్రికెట్ బెట్టింగ్, వంటివాటికి పాల్పడవద్దని మొదట్లో డబ్బులు వచ్చినప్పటికీ క్రమక్రమంగా వీటికి బానిసలుగా మారితే కచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

#BollywoodActor #VaibhavJadhav #Vaibhav Jadhav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు