ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియా ప్లాట్ఫారంలో వెబ్ సిరీస్ ల హవా బాగా నడుస్తోంది.దీనికితోడు వెబ్ సిరీస్ లకు సెన్సార్ కట్లు లేకపోవడంతో కొందరు ఏకంగా వెబ్ సిరీస్ ల పేరుతో శృంగార భరిత తరహా చిత్రాలను తీస్తున్నారు.
కాగా తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు కమెడియన్ “సునీల్ పాల్” తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో కొందరు దర్శక, నిర్మాతలు సెన్సార్ బోర్డు నిబంధనలు లేకపోవడంతో వెబ్ సిరీస్ పేరుతో శృంగారం, వైలెన్స్, వంటి వాటిని ప్రోత్సహిస్తూ వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా బాలీవుడ్ లో ఇటీవలే అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారం కేసులో “రాజ్ కుంద్రా” ని అరెస్టు చేసిన విషయం పై కూడా స్పందిస్తూ రాజ్ కుంద్రా ని అరెస్టు చేయడం మంచిదేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అలాగే ఈ ఈ వెబ్ సిరీస్ ల పేరుతో సినిమాలు తెరకెక్కించే వారికి బాలీవుడ్ లోని పలువురు స్టార్ సెలబ్రెటీలు సపోర్ట్ చేస్తున్నారని, అలాగే నటీనటులకు కూడా పెద్ద మొత్తంలో పారితోషికాలు ఇవ్వడంతో వాళ్లు కూడా పెద్దగా అడ్డు చెప్పడం లేదని చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే “ది ఫ్యామిలీ మాన్, మీర్జాపూర్” తదితర వెబ్ సీరీస్ లపై ఘాటు విమర్శలు చేశాడు.అయితే ఈ వెబ్ సిరీస్ లలో ఎక్కువగా మహిళల అక్రమ సంబంధాలు, అలాగే భార్య భర్తల బంధాలని ఎగతాళి చేస్తూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటివి హైలెట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.అంతేకాకుండా రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ప్రముఖనటు మనోజ్ భాజపాయ్ కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడం అతి నీచమైన విషయమని ఘాటు విమర్శలు చేశాడు.