నా బయోపిక్ లో నేనే హీరోగా చేస్తా అంటున్న సోనూసూద్

కరోనా కష్టకాలంలో ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులని సొంత రాష్ట్రాలకి పంపించడంలో నటుడు సోనూసూద్ తన గొప్ప మనసు చాటుకున్నాడు.వేల సంఖ్యలో కార్మికులు ఇతని ద్వారా కరోనా సమయంలో సాయం పొందారు.

 Bollywood Actor Sonusood Responds On His Biopic-TeluguStop.com

వలస కూలీలని గమ్యానికి చేర్చడానికి ప్రత్యేకంగా సొంత ఖర్చులతో రైలు కూడా వేశాడు.ఇక బస్సుల సంఖ్య అయితే చెప్పాల్సిన పని లేదు.

కరోనా సమయంలో బాలీవుడ్ లో కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు చాలా మంది ఒక్క పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి, ప్రభుత్వానికి సాయం చేయడానికి ముందుకి రాలేదు.కాని కేవలం విలన్ వేషాలు వేసుకునే సోనూసూద్ మాత్రం తన పెద్ద మనసు చాటుకున్నాడు.

 Bollywood Actor Sonusood Responds On His Biopic-నా బయోపిక్ లో నేనే హీరోగా చేస్తా అంటున్న సోనూసూద్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో మీడియా కూడా అతను చేసే సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చింది.ఇంత గొప్ప మానవత్వం చూపించిన సోనూసూద్ ఎక్కడా కూడా తన అతి చూపించలేదు.

దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ మూడు నెలల కాలంలో ఎక్కువ మంది వెతికిన నటుడుగా మారాడు.

ఈ నేపధ్యంలో సోనూసూద్ లైఫ్ స్టొరీ కూడా అలాగే ఫుట్ పాత్ స్టేజి నుంచే మొదలైంది అని ఒకానొక సందర్భంగా చెప్పారు.

ఈ నేపధ్యంలో అతని జీవితంపై సినిమా తీయడానికి బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.తన జీవితంపై సినిమా తీయాలని బాలీవుడ్ ఫిలింమేకర్స్ భావిస్తుండడం పట్ల సోనూ సూద్ స్పందించాడు.

ఎవరైనా తన బయోపిక్ తీస్తే అందులో హీరో పాత్రను తానే పోషిస్తానని స్పష్టం చేశాడు.తన జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదురైన అనుభవాలు తనకంటే బాగా ఇతరులకు తెలియవని అన్నాడు.

కాగా, లాక్ డౌన్ అనుభవాలతో సోనూ సూద్ ఓ పుస్తకం రాయాలనుందని ఇటీవలే వెల్లడించాడు.మరి అతను ఇచ్చిన ఆఫర్ అందుకొని అతనితో బయోపిక్ తీయడానికి ఏ దర్శకుడు ముందుకొస్తాడు అనేది చూడాలి.

#Lock Down #Corona Crisis #BollywoodActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు