సోనూసూద్ కోసం తరలివెళ్లిన హైదరాబాద్ జనం.. వైరల్ వీడియో!  

ఒకప్పుడు సోను సూద్ గురించి చెప్పాలంటే కేవలం సినిమాలలో నటించే ఒక ప్రతినాయకుడుగా మాత్రమే తెలుసు.కానీ కరోనా వల్ల అతడు రీల్ లైఫ్ లో విలన్ గానే కాకుండా, రియల్ లైఫ్ లో హీరో అని చెప్పవచ్చు.

TeluguStop.com - Bollywood Actor Sonusood Fidaa On Hyderabadis Love

కరోనా విజృంభించిన నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన కారణంగా వలస కార్మికులు తమ సొంత గూటికి కాలినడకన పయనమయ్యారు.ఈ దృశ్యం సోనూసూద్ ను ఎంతగానో కలిచివేసింది.

తన వంతు సహాయంగా దాదాపు 20 వేల మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో సొంతగూటికి చేర్చాడు.

TeluguStop.com - సోనూసూద్ కోసం తరలివెళ్లిన హైదరాబాద్ జనం.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ విధంగా కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలవడంతో రియల్ హీరో అంటూ అందరి చేత అభినందనలు పొందాడు.

తర్వాత సోషల్ మీడియా లో ఎవరైనా తమకు కష్టమని వేడుకుంటే వెంటనే వారికి ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చే వాడు.ఇలా యావత్ భారతదేశం మొత్తం తన అభిమానుల గుండెల్లో హీరోగా నిలిచిపోయాడు.

ఒకప్పుడు హీరోలంటే అభిమానం మాత్రమే చూపించేవారు.కానీ ప్రస్తుతం సోనుసూద్ విషయంలో ఏకంగా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి అంటే ఏ స్థాయిలో తనను ఆదరించారో ఇట్టే తెలిసిపోతుంది.

లాక్‌డౌన్‌ అనంతరం షూటింగ్ లో పాల్గొంటున్న సోనుసూద్ తాజాగా ఆచార్య చిత్రం షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సోను సూద్ ను కలవటానికి తరలి వెళ్లారు.

భారీ సంఖ్యలో తన అభిమానులు క్యారీవాన్ దగ్గరకు చేరుకొని నానా హంగామా చేయడంతో బయటకు వచ్చి వారందరిని పలకరించారు.వారు చూపించిన అభిమానం సోను సూద్ కు ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఈ విషయమై హైదరాబాద్ లవ్ అంటూ తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు.ఆచార్య సినిమాలో మాత్రమే కాకుండా, అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా సోనూసూద్ కీలక పాత్రలో నటించనున్నారు.

#Lock Down #Fidaa #@fcsonusood #FansCome #BollywoodActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Actor Sonusood Fidaa On Hyderabadis Love Related Telugu News,Photos/Pics,Images..