సంజయ్ దత్ కి లంగ్ క్యాన్సర్.. ఏ స్టేజ్ లో ఉందంటే?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే ఇటీవలే అతను ఓ ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు.

 Bollywood Actor Sanjay Dutt Has Been Diagnosed With Stage 3 Lung Cancer, Sanjay-TeluguStop.com

ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితో చేరిన ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు.

అతనికి కరోనా సోకిందేమో అని పరీక్షలు నిర్వహించగా అందులో నెగటివ్ అని తేలింది.

దీంతో సోమవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అవ్వగా ఆ సమయంలో అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు.తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంజయ్ దత్ చెప్పారు.

అయితే సోమవారం ఆలా చెప్పారో లేదో నిన్న రాత్రి తనకు లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది.

సంజయ్ దత్ కి ప్రమాదకరమైన లంగ్ క్యాన్సర్ ఉందని, అది కూడా స్టేజ్ 3 ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న విషయం అయనకు సోమవారం నిర్వహించిన టెస్టులో బయటపడింది.

ఇంకా ఈ విషయాన్నీ స్వయంగా అతనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నట్టు ఆరోగ్యంగా తిరిగి వస్తానంటూ అయన ట్విట్ చేశాడు.

అయితే అతనికి క్యాన్సర్ రావడానికి అతని అలవాట్లే కారణం అని, సిగిరెట్లకు, మద్యానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube