విడాకులు కావాలని నోటీసులు పంపిన విలన్ భార్య...

బాలీవుడ్ లో 70కి పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి గురించి తెలియని వారుండరు.అయితే ఇతడు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క భారీ బడ్జెట్ సీరీస్ లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

 Nawazuddin Siddiqui, Bollywood Actor,  Aaliya, Divorce, Bollywood-TeluguStop.com

అయితే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ మధ్యకాలంలో నవాజుద్దిన్ సిద్ధిఖి భార్య అలియాతో మనస్పర్ధలు మరియు గొడవలు విపరీతంగా పెరిగిపోయాయని దాంతో ఆలియా నవాజుద్దీన్ నుంచి విడాకులు కోరుతుందని పలువురు సోషల్ మీడియాలో బలంగా చర్చించుకుంటున్నారు.

అంతేగాక ఇప్పటికే ఆలియా విడాకులు ఇవ్వాలంటూ కోర్టు నుంచి నవాజుద్దీన్ కి నోటీసులు కూడా పంపించిందట.కానీ నవాజుద్దిన్ మాత్రం తన భార్య నుంచి విడిపోవడానికి ఇష్ట పడడం లేదట.దీంతో అలియా పంపించిన నోటీసులకు నవాజుద్దిన్ స్పందించకపోవడంతో ఆమె చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందట.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

అయితే సోషల్ మీడియాలో నవాజుద్దీన్  విడాకుల గురించి ఇంత జరుగుతున్నప్పటికీ అతడు మాత్రం స్పందించడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖి “బోలె చుడీయాన్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

అయితే గతంలో నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలో నటించినటువంటి స్కేర్డ్ గేమ్స్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫారం లో బాగా హిట్ అయింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube