బాలీవుడ్ లో డ్రగ్స్ దాడులు.. పరారీలో నటుడు.. ?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అప్పటి నుండి డ్రగ్స్ కేసులో ఎందరో బాలీవుడ్ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

 Bollywood Actor Gaurav Dixit Missing After Ncb Drugs Raids , Bollywood, Drug Cas-TeluguStop.com

మొత్తానికి డ్రగ్స్ కలకలం బాలీవుడ్ ను తెగ ఊపేస్తుంది.

ఇకపోతే డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ ను విచారించిన అధికారులు, అతను ఇచ్చిన సమాచారంతో మరో నటుడు గౌరవ్ దీక్షిత్ ఇంటిపై దాడి చేయగా, భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే.

ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే గౌరవ్ దీక్షిత్, తన విదేశీ స్నేహితురాలితో అక్కడికి వచ్చాడని, ఎన్సీబీ టీమ్ ను చూసి, అక్కడి నుంచి అతను పారిపోయాడని ఓ అధికారి తెలిపారు.కాగా గౌరవ్ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత ఈ కేసు కీలక మలుపులు తీరుగుతుంది.కాగా ఈ డ్రగ్స్ జాబితాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వంటి చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube