మామూలుగా సోషల్ మీడియా మాధ్యమాలలో సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ కొంతమంది పాపులర్ కావాలని ప్రయత్నిస్తూ సినీ సెలబ్రిటీల గురించి అసత్య కథనాలు మరియు తప్పుడు ప్రచారాలు చేయడం అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం.కాగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరో ఫర్హాన్ అక్తర్ గురించి కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ప్రముఖ హీరో మరియు సినీ నిర్మాత ఫర్హాన్ అక్తర్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఈ క్రమంలో పలు చిత్రాలలో హీరోగా నటిస్తుండడమే కాకుండా నిర్మాతగా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.
అయితే తాజాగా హిందువుల దేవతయైన లక్ష్మీ దేవి కి సంబంధించిన దంతేరస్ పూజ ని ఫర్హాన్ అక్తర్ తన ఆఫీసులో నిర్వహించాడు.ఇందులో భాగంగా తనతో పాటు పని చేసేటువంటి పలువురు ప్రముఖులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.
దీంతో ఫర్హాన్ అక్తర్ పూజ చేస్తున్న సమయంలో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.దాంతో కొందరు నెటిజన్లు ఫర్హాన్ అక్తర్ గురించి నెగటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు.
అలాగే ఇస్లాం మతానికి చెందిన కొందరు నెటిజన్లు ఫర్హాన్ అక్తర్ వ్యక్తిగతంగా ఇస్లాం మతానికి చెందినప్పటికీ ఎప్పుడూ కూడా ఇస్లాం మత ఆచార సంప్రదాయాలను పాటించడని అంటూ ఎద్దేవా చేస్తున్నారు.కొందరైతే ఏకంగా ఫర్హాన్ అక్తర్ కేవలం పేరుకే ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని కానీ ఆయన చేసేటువంటి పనులకు మతానికి ఏమాత్రం సంబంధం లేదని కామెంట్లు చేస్తున్నారు.
దీంతో కొందరు ఫర్హాన్ అక్తర్ అభిమానులు మాత్రం భారతదేశం భిన్న భాషలకు విభిన్న మతాలకు నిలయమని అలాంటప్పుడు ఇతర మతస్తులను గౌరవించడం మరియు వారి ఆచారాలను పాటించడం వంటివి చేయడంలో తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఫర్హాన్ అక్తర్ గురించి సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ అతడు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ తాజాగా తుఫాన్ అనే చిత్రంలో హీరోగా నటించాడు.అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.కాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చే సూచనలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేశారు.కానీ ఈ చిత్రం ఫర్హాన్ అక్తర్ కి మంచి లాభాల పంట పండించింది.
కాగా ప్రస్తుతం తుఫాన్ చిత్రం ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.అయితే ఇటీవలే ఫర్హాన్ అక్తర్ బాలీవుడ్ లో మరో చిత్రాన్ని నిర్మించేందుకు మరియు దర్శకత్వం వహించేందుకు కథ ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.