రజినీకాంత్ కోసం యంగ్ బాలీవుడ్ విలన్  

రజిని సినిమాలో విలన్ గా అవకాశం అందుకున్న బాలీవుడ్ నటుడు. .

Bollywood Actor As A Vilan In Rajinikanth Movie-kollywood,rajinikanth Movie,south Cinema,tollywood,vilan

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత మళ్ళీ రజిని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటికే పోస్టర్ తోనే ఈ సినిమాపై మళ్ళీ కాపీ కాట్ ముద్ర ని దర్శకుడు మురుగదాస్ వేసేసుకున్నాడు..

రజినీకాంత్ కోసం యంగ్ బాలీవుడ్ విలన్-Bollywood Actor As A Vilan In Rajinikanth Movie

సినిమా తీసే క్రమంలో ఇలాంటి రూమర్స్ రెగ్యులర్ గా వచ్చేవే కాబట్టి దర్శకుడు సినిమాలో కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినీకాంత్ కి విలన్ బాలీవుడ్ యాక్టర్ ని మురుగదాస్ రంగంలోకి దించుతున్నాడని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఒకప్పటి నటులు రాజ్ బబ్బర్, స్మిత పాటిల్ కొడుకు ప్రతీక్ బబ్బర్ ని విలన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికి యాక్టర్ గా బాలీవుడ్ లోకి ఈ కుర్ర హీరో ఎంట్రీ ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా రజినీకాంత్ కి విలన్ గా నటించే అవకాశం రావడంతో వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.