రెండు కోట్ల తేడాతో 'సీత' చేజార్చుకుంది

రామాయణం పై ఇప్పటి వరకు ఎన్నో సినిమా లను తెలుగు ప్రేక్షకులు ఇంకా ఇండియన్ సినీ అభిమానులు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే వచ్చిన ప్రతి సినిమా కూడా రామాయణంలో రాముడి గురించి రావణుడి గురించి చెప్పడం జరిగింది.

 Bolllywood Movie Sita Now Kangana Hands-TeluguStop.com

లవకుశ సినిమాలో మాత్రం సీత అమ్మవారి కష్టాలను చూపించారు.కాని ఇప్పటి వరకు సీత దేవి పరాక్రమం మరియు ఆమె యొక్క గొప్పతనం ను ఏ సినిమా లో కూడా చూపించలేదు.

ఆ పాయింట్ తో విజయేంద్ర ప్రసాద్‌ ఒక అద్బుతమైన కథను రాశాడు.దానికి సీత అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 Bolllywood Movie Sita Now Kangana Hands-రెండు కోట్ల తేడాతో సీత’ చేజార్చుకుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు లో మరియు ఇతర అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను చేయాలనుకుంటున్నారు.మొదట ఈ సినిమా కోసం కరీనా కపూర్‌ ఖాన్ ను సంప్రదించారట.

ఆమె పన్నెండు కోట్ల పారితోషికం ఇవ్వమని డిమాండ్‌ చేసింది.అందుకే మేకర్స్ నో చెప్పారు.

ఆమె పారితోషికం విషయంలో తగ్గక పోవడంతో ఆమె స్థానంలోకి కంగనా వచ్చేసింది.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఒక ప్రకటన చేశారు.

అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో , శ్రీ విజయేంద్రప్రసాద్ గారి రచనలో, అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నసీత

Telugu Bollywood, Film News, Kangana, Sita, Talaivi, Vijayendra Prasad-Movie

భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమా లో రాముడు ఉంటాడా.ఉంటే ఎవరు కనిపించబోతున్నారు అంటూ కొత్త చర్చ మొదలు అయ్యింది.భారీ ఎత్తున అంచనాలున్న సీత సినిమా ను తెలుగు లో కూడా భారీ ఎత్తున చూసే అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే తెలుగు లో విజయేంద్ర ప్రసాద్‌ గురించి ఆయన గొప్పతనం గురించి అందరికి తెలుసు.ఆయన చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

బాహుబలి.భజిరంగీ భాయిజాన్ సినిమా తో కథకుడిగా పాన్ ఇండియా గుర్తింపును విజయేంద్ర ప్రసాద్‌ దక్కించుకున్నాడు.

కనుక సీత దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోవడం ఖాయం.

#Talaivi #Kangana #Sita

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు