బొమ్మని పెళ్లాడిన బాడీ బిల్డర్

అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.ఈ మధ్య కాలంలో మనుషులు ఒంటరి జీవితాలకి బాగా అలవాటు పడిపోయారు.

 Bodybuilder Vows To Marry His Doll, Social Media, Relationship, Marriage, Kazakh-TeluguStop.com

అలాగే మనుషులతో కంటే జంతువులతో, వస్తువులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు.దీంతో బంధాల గురించి వారి అభిప్రాయాలు పూర్తిగా మారిపోతున్నాయి.

కొంత మంది అమ్మాయిలు తమ పెంపుడు జంతువులని వివాహం చేసుకుంటున్న ఘటనలు విదేశాలలో గతంలో జరిగాయి.అలాగే ఇంట్లో మొక్కలని, వస్తువులని కూడా పెళ్లి చేసుకున్న ఘటనలు జరిగాయి.

అయితే తాజాగా కజగిస్థాన్ కి చెందిన ఒక బాడీ బిల్డర్ ఒక అమ్మాయి బొమ్మని వివాహం చేసుకున్నాడు.ఈ వివాహ వేడుకకి బంధుమిత్రులని సైతం ఆహ్వానించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవడం విశేషం.

ఇప్పుడు అతని వివాహానికి సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాడీబిల్డర్ యూరి టోలోచ్కో బొమ్మతో వివాహం ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉండగా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యంగా జరిగింది.

కేవలం 12 మంది అతిథులతో నైట్ క్లబ్ లో యూరి బొమ్మను వివాహం చేసుకున్నాడు.తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయిందని, దీంతో మరమ్మతులు చేయించేందుకు తన బొమ్మ భార్యను వేరే నగరానికి పంపించానని యూరి తెలిపాడు.

తన బొమ్మ భార్య కోలుకున్నాక తనతో గడుపుతానని బొమ్మతో తన పెళ్లి చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.తన బొమ్మ భార్య లేని సెలవురోజుల్లో తన స్నేహితులతో గడుపుతానని యూరి వివరించారు.

అయితే అతను బొమ్మని వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.అయితే తాను బొమ్మని వివాహం చేసుకోవడానికి గల కారణం మాత్రం యూరీ తెలియజేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube