వైరల్‌ : కండలు పెంచుకునేందుకు ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి రోజు విషం తీసుకుంటున్నాడు

కొందరికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలను నెరవేర్చుకునేందుకు కొందరు చాలా ప్రయత్నిస్తారు.కాని అవి నెరవేరకుండా వదిలేస్తారు.

 Bodybuilder Pumps Synthol Into His Muscles And Now Looks Like This-TeluguStop.com

కాని మరి కొందరు మాత్రం నెరవేరకుంటే మరో మార్గం అంటూ భయంకరమైన మార్గంను ఎంచుకుంటారు.ఆ క్రమంలో వారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

కాని వారు అది లక్ష్య పెట్టకుండా తమ కోరిక ఆశయం సాధించేందుకు సిద్దం అవుతారు.ఒక వ్యక్తి తన కోరిక నెరవేర్చుకునేందుకు ఏకంగా తన శరీరంలోకి విషంను ఎక్కించుకుంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బ్రెజిల్‌కు చెందిన వాల్దిర్‌ సెగాటో అనే బాడీ బిల్డర్‌ తన బాడీని హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్‌ స్థాయికి తీసుకు రావాలని భావించాడు.అందుకోసం రోజులో గంటల కొద్ది బాడీ బిల్డింగ్‌ చేశాడు.

తిండి విషయంలో ఇంకా ఇతర విషయంలో చాలా ఎఫర్ట్‌ పెట్టాడు.ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా అతడి కండలు ఆర్నాల్డ్‌ స్థాయికి రాలేదు.

దాంతో చేసేది లేక మరో మార్గం అన్నట్లుగా ఇంజక్షన్‌ పద్దతిని ఎంపిక చేసుకున్నాడు.ఇంజక్షన్‌ ద్వారా ఇప్పటికే అతడు భారీగా కండలు పెంచాడు.

వైరల్‌ : కండలు పెంచుకునేందుకు

కొండల్లాంటి కండల కోసం అంతడు కొన్నాళ్లుగా నువ్వుల నూనేను ఒంట్లోకి ఇంజెక్ట్‌ చేసుకుంటున్నాడు.నువ్వుల నూనెతో పాటు పెయిన్‌ కిల్లర్స్‌ మరియు ఆల్కహాల్‌ను కూడా అతడు కండల్లోకి పంపిస్తున్నాడు.ఈ మూడింటి మిశ్రమం విషంలా పని చేస్తుందని వైధ్యులు హెచ్చరిస్తున్నా కూడా కొద్ది కొద్ది పరిమాణంలో అతడు కండల్లోకి ఇంజక్షన్‌ చేసుకుంటున్నాడు.దాంతో ప్రస్తుతం అతడి కండలు భారీగానే పెరిగాయి.

అయినా ఇంకా కూడా తన కండల పరిమాణం పెరగాలని భావిస్తున్నాడు.

వైరల్‌ : కండలు పెంచుకునేందుకు

50 ఏళ్ల వయసు ఉన్న ఈ వ్యక్తి తన కండలను 23 ఇంచుల మంది పెరిగేలా ప్రయత్నిస్తున్నాడు.కండలు పెంచుకోవడం కోసం ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వాల్దిర్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలు ఎందుకు అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే కాకుండా కనీసం సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయినా ఈ ఇంజక్షన్స్‌ ప్రభావం ఉంటుందని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube