ఇది విన్నారా : కండల కోసం ప్రయత్నిస్తే తండ్రి అయ్యే భాగ్యం కోల్పోతారట

ఆడవారిని ఆకర్షించేందుకు మగవారు కండలు పెంచడం, చెస్ట్‌ చూపించడం, సిక్స్‌ ప్యాక్‌ చూపించడం చేస్తూ ఉంటారు.కొంత మంది అమ్మాయిలు ముఖ్యంగా కొందరు సిటీ కల్చర్‌కు అలవాటు పడ్డ అమ్మాయిలు కండల వీరులను చూసి మోజు పడుతూ ఉంటారు.

 Body Building Workouts Is Not Good For Man-TeluguStop.com

అలాంటి వారితో స్నేహం, ప్రేమను అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు.దాంతో అబ్బాయిలు ఎక్కువగా కండలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే అబ్బాయిలు కండలు పెంచే క్రమంలో సంతానోత్పత్తి సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని వైధ్యులు అంటున్నారు.

ఇది విన్నారా : కండల కోసం ప్రయత�

అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇద్దరు ఈ విషయమై ప్రయోగం చేసి నమ్మలేని నిజాలను కనిపెట్టారు.కండలు పెంచే క్రమంలో కొందరు లైట్‌ డోస్‌ స్టెరాయిడ్స్‌ను వాడుతూ ఉన్నారు.అమెరికాలో ఇది సర్వ సాదారణం అయ్యింది.

అయితే ఆ లైట్‌ డోస్‌ స్టెరాయిడ్స్‌ కాస్త హెవీ డోస్‌ అవుతున్నాయి.కొందరు కాస్త శృతిమించి మరీ తీసుకుంటున్నారు.

స్టెరాయిడ్స్‌ వల్ల పురుషుడి స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతుందని డాక్టర్లు అంటున్నారు.ప్రస్తుతం ఈ విషయమై ఇంకా లోతుగా అధ్యాయనం జరుగుతుందని అంటున్నారు.

ఇది విన్నారా : కండల కోసం ప్రయత�

సహజంగా ఎక్సర్‌సైజ్‌లు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.కాని అక్రమ మార్గంలో అంటే డ్రగ్స్‌ వాడి కండలు పెంచాలనుకుంటే మాత్రం వారు భవిష్యత్తులో తండ్రులు అవ్వలేరు అంటూ వెళ్లడయ్యింది.ఇండియాలో స్టెరాయిడ్స్‌ వాడకం కాస్త తక్కువగానే ఉంటుంది.కాని అమెరికాతో పాటుక ఒన్ని అభివృద్ది చెందిన దేశాల్లో స్టెరాయిడ్స్‌ చాలా ఎక్కువగా వాడటం వల్ల తండ్రులు అయ్యే భాగ్యం కోల్పోతున్నారు.

అత్యంత శోచనీయ్యమైన విషయం ఏంటి అంటే అమ్మాయిల కోసం కండలు పెంచి వారిని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత పిల్లలు లేక ఇద్దరు ఇబ్బంది పడటం జరుగుతుంది.అందుకే సహజంగా వచ్చేదాన్ని మించి మరేది అక్కర్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube