దారుణం: శివాలయంలో ఇద్దరు సాధువుల దారుణ హత్య

కరోనా మహమ్మారి తో ఒకపక్క మరణాలు చోటుచేసుకుంటుండగా మరోవైపు హత్య వంటి దారుణ ఘటనలు కూడా చోటుచేసుకుంటుండం తీవ్ర కలకలం రేపుతోంది.ఎప్పుడు ఎవరు కరోనా వల్ల మృతి చెందుతారో అర్ధం కానీ ఈ పరిస్థితుల్లో ఏకంగా శివాలయం లోనే ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది.

 Corona Virus, Murder, Uttar Pradesh, Bulandshahr, Shiva Temple, Police, Jagdish,-TeluguStop.com

ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ బులంద్‌షహర్‌లో జరిగింది.మంగళవారం తెల్లవారుజామున యూపీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

బులంధర్‌లోని ఓ ఆలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చినట్లు తెలుస్తుంది.మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం తో హుటాహుటిన అక్కడకి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతిచెందిన ఇద్దరు సాధువులు 55 ఏళ్ల జగదీష్ అలియాస్ రంగి దాస్‌గా, మరో సాధువు 45 ఏళ్ల షేర్ సింగ్ అలియాస్ శివ దాస్‌గా గుర్తించారు.
వీరిద్దరూ శివాలయంలో పురోహితులుగా పనిచేస్తూ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.

అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్య చేసిన నిందితులు పదునైన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలిపారు.అయితే ప్రక్క గ్రామానికి చెందిన మురళి అలియాస్ రాజు అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో అతడిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అయితే రెండు రోజుల క్రితం హత్యకు గురైన సాధువులకు,నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు కు చిన్నపాటి ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తుంది.

సాధువులకు సంబందించిన కొన్ని వస్తువులను దొంగిలించడానికి రాజు ప్రయత్నించడం తో వీరిమధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మత్తుమందు ఇచ్చి వారిని దారుణంగా హత్య చేసినట్లు సమాచారం.,/br>

Telugu Bulandshahr, Corona, Jagdish, Raju, Shiva Temple, Uttar Pradesh, Yogi Adi

మంగళవారం ఉదయం రాజు తన చేతిలో పదునైన కత్తితో గ్రామం నుంచి వెళ్తున్నట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.అయితే పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా నిందితుడు రాజు స్పృహలో లేడని పోలీసులు చెబుతున్నారు.కాగా సాధువుల హత్యతో గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేస్తుండడం తో అదనపు బలగాలతో పరిస్థితిని అదుపు చేస్తున్నారు పోలీసులు.మరోవైపు ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ లోతైన విచారణ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube