సుప్రీం సీజేఐ గా ప్రమాణ స్వీకారం చేసిన బాబ్డే

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బాబ్డే చేత ప్రమాణస్వీకారం చేయించారు.

 Bobde Take Oath As Cji-TeluguStop.com

ఇటీవల సుప్రీం చీఫ్ జస్టిస్ గా ఉన్న రంజన్ గొగోయ్ పదవీ కాలం ముగియడం తో ఆయన వారసుడిగా బాబ్డే ని ఎన్నుకోవడం తో సుప్రీం కోర్టు 47 వ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ రోజు ఉదయం 9:30 గంటల సమయంలో రాష్ట్రపతి సమక్షంలో ఆయన తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు.దీనితో ఈ రోజు నుంచి బాబ్డే సుప్రీం చీఫ్ జస్టిస్ గా భాద్యతలు స్వీకరించనున్నారు.సుప్రీంకోర్టులో ఎంతో మంది జడ్జిలు ఉన్నా బాబ్డేను తన వారసుడిగా చేయమని ప్రతిపాదించారు గొగోయ్.

గొగోయ్ తరువాతే బాబ్డే సీనియర్ జడ్జి కావడం తో ఆయన పేరు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.దీనితో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆయన CJIగా 18 నెలలు పనిచేసి ఏప్రిల్ 23, 2021లో రిటైర్మెంట్ తీసుకోనున్నారు.1956 ఏప్రిల్ 24న నాగపూర్‌లో జన్మించిన జస్టిస్ బాబ్డే (63) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నాగపూర్ యూనివర్శిటీ నుంచీ లా డిగ్రీ తీసుకున్నారు.1978లో ఆయన మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో సభ్యుడైన ఆయన1998లో సీనియర్ అడ్వకేట్‌గా మంచి గుర్తింపు పొందారు.2000 మార్చి 29న జడ్జిగా కెరీర్ మొదలుపెట్టారు బాబ్డే.బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు.

Telugu Bobde, Bobde Oath Cji, Indian Supreem, Supreemshardh-

2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా కూడా పనిచేశారు.2013 ఏప్రిల్ 12న బాబ్డే సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు.అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరిగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే గొగోయ్ తరువాత సీనియర్ జడ్జి గా బాబ్డే ఉండడం తో గొగోయ్ కూడా ఆయన పేరే ప్రతిపాదనకు తీసుకురావడం తో ఇప్పుడు బాబ్డే సుప్రీం చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube