స్టార్ హీరో కుమారుడైనా 10 ఏళ్లు అవ‌కాశాలు లేవు... వెబ్‌సిరీస్ రాక‌తో...

Bobby Deol Birthday Special Lesser Known Facts Net Worth , Bobby Deol ,bobby Deol Birthday Special , Vijay Singh Deol,Dharmendra, Prakash Kaur,bobby Deol Birthday Special Lesser,Bollywood Actor Bobby Deol

బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ జనవరి 27న తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.బాబీ ప్ర‌ముఖ‌ నటులు ధర్మేంద్ర మరియు ప్రకాష్ కౌర్‌లకు జన్మించాడు.

 Bobby Deol Birthday Special Lesser Known Facts Net Worth , Bobby Deol ,bobby Deo-TeluguStop.com

బాబీ డియోల్ పూర్తి పేరు విజయ్ సింగ్ డియోల్.బాబీ డియోల్ అతిత్వ‌ర‌గా తెరపైకి వచ్చిన బాలీవుడ్ స్టార్‌కిడ్‌లలో ఒకరు.బాబీ తొలిసారి ‘ధరమ్‌వీర్’ చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు.1995లో ‘బర్సాత్’ కథానాయకుడిగా అతని మొదటి చిత్రం.ఈ చిత్రానికి గాను అతను ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డును అందుకున్నాడు.

బాబీ ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించాడు తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలను అందించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

అతని సూపర్‌హిట్ చిత్రాలలో బర్సాత్‌, సోల్డ‌య‌ర్, బాదల్, స్కార్పియన్ మొద‌లైన చ‌త్రాలు ఉన్నాయి.‘హమ్‌రాజ్‌’ చిత్రానికి గానూ బాబీ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.సూపర్ స్టార్ నటుడి కుమారుడు అయిన తర్వాత కూడా పదేళ్లు అవ‌కాశాలు లేని ప‌రిస్థితుల‌ను కూడా బాబీ ఎదుర్కొన్నాడు.నైట్ క్లబ్‌లో డీజేగా కూడా పనిచేశాడు.

ఎన్నో వ్యాపారాలు చేశాడు.ఈ సమయంలో, అతను బరువు కూడా పెరిగాడు.

ఇంతలో సల్మాన్ స‌హ‌కారంతో నిరాశలో మునిగిపోయిన బాబీ రేస్-3తో బ్రేక్ వ‌చ్చింది.

Telugu Bobby Deol, Bollywoodbobby, Dharmendra, Prakash Kaur-Movie

ఆశ్రమ్ కారణంగా అతని కెరీర్ ట్రాక్‌లో ప‌డింది సల్మాన్ ఖాన్ చిత్రం రేస్ 3 తర్వాత, బాబీ అదృష్టం కొద్దిగా మారింది.అయితే ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ అతని కెరీర్‌ను మ‌రింత ముందుకు తీసుకు వెళ్లింది.ఆశ్రమ్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన ‘లవ్ హాస్టల్’ చిత్రంలో కూడా బాబీ డియోల్ కనిపించాడు.

బాబీ డియోల్‌ను దాదాపుగా అంద‌రూ మర్చిపోయారు.కానీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అతనికి నటుడిగా కొత్త జన్మనిచ్చింది.

Telugu Bobby Deol, Bollywoodbobby, Dharmendra, Prakash Kaur-Movie

తాన్యతో తొలిచూపులోనే ప్రేమ సినిమాలు,వెబ్ సిరీస్‌లతో పాటు, బాబీ డియోల్ వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు.అతనికి ముంబైలో రెండు చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయి.బాబీ రెస్టారెంట్ పేరు సమ్‌ప్లేస్ ఎల్స్.ఇదేకాకుండా రెండో రెస్టారెంట్ పేరు ‘సుహానాస‌.బాబీకి ముంబైలోని జుహులో విలాసవంతమైన ఇల్లు ఉంది.బాబీ డియోల్ తన కెరీర్ ప్రారంభ దశలో తాన్యను వివాహం చేసుకున్నాడు.

తాన్య మరియు బాబీ 1996లో వివాహం చేసుకున్నారు.నిజానికి బాబీ మొదటి చూపులోనే తాన్యతో ప్రేమలో పడ్డాడు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube