బొబ్బిలి కోటలో అలనాటి ఆయుధాలకు రాజకుటుంబ వారసులు ప్రత్యేక పూజలు ..

దసరా వచ్చిందంటే సామాన్యుని నుంచి రాజకుటుంబాల వరకు పండగ సందడే.ముఖ్యంగా సంప్రదాయానుసారం ఆయుధ పూజను నిర్వహిస్తుంటారు.

 In Bobbili Fort, The Royal Family Pays Special Homage To The Weapons Of The Time-TeluguStop.com

రాజకుటుంబాల్లో ఆయుధ పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.ఇక చారిత్రాత్మక బొబ్బిలి కోటలో అలనాటి ఆయుధాలకు రాజకుటుంబ వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

బొబ్బిలి రాజులైన మాజీ మంత్రి సుజయక్రుష్ణ రంగారావు, ఆయన సోదరులు బేబీనాయన, రామ్ నాయనలు సంప్రదాయబద్ధంగా ఆయుధాలకు ప్రత్యేక పూజలను కుటుంబ సమేతంగా నిర్వహించారు.ఈ వేడుకలను చూసేందుకు ప్రజలంతా తరలివచ్చారు.

కోటలో జరిగే ఆయుధ పూజ సందర్భంగా బొబ్బిలి యుద్ధ కాలం నాటి ఆయుధాలను ప్రదర్శించి, వాటికి సంప్రదాయ పూజలు నిర్వహించారు.అదే విధంగా అప్పటి రాజ దర్భార్ సింహాసనాన్ని కూడా ఈ వేడుకలో ఉంచి పూజలు చేయడం విశేషం.

ఈ సందర్భంగా కోట ప్రాంగణం మేళ తాళాలు సాము గారఢీల విద్యలతో బొబ్బిలి రాజుల ప్రాభవాన్ని తెలిపే రీతిగా ఆయుధ పూజ వేడుకలు జరిగాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube