12 ఏళ్ల వయస్సులో సొంత సంపాదనతో బీఎండబ్ల్యూ కారు కొంది.. ఆ బాలిక ఏం చేస్తుందో తెలుసా?  

Bmw Car In 12 Years Age With Own Earnings-age,bike,bmw Car,cycle,general Telugu Updates,makeup,own Earnings,wedding

పాతిక ఏళ్ల వయస్సులో ఒక కుర్రాడు కష్టపడి, తన సొంత డబ్బుతో బైక్‌ కొనుగోలు చేశాడు అంటూ అది అతడి గొప్పదనంగా చెప్పుకుంటారు. చిన్న పిల్లాడు కష్టపడి తాను సంపాదించుకున్న డబ్బుతో సైకిల్‌ కొనుగోలు చేసినా కూడా ఆ పిల్లాడిని అభినందించకుండా ఉండలేం. అయితే కొందరు జులాయిగా తిరుగుతూ మూడు పదుల వయసు దాటిపోయినా కూడా ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు..

12 ఏళ్ల వయస్సులో సొంత సంపాదనతో బీఎండబ్ల్యూ కారు కొంది.. ఆ బాలిక ఏం చేస్తుందో తెలుసా?-BMW Car In 12 Years Age With Own Earnings

ముఖ్యంగా ఇండియాలో అలాంటి వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఎంత చెప్పినా ఏం చేసినా కూడా మారరు. అయితే ఈ 12 ఏళ్ల నట్టానన్‌ ను చూసి అయినా వారు కాస్త మారితే బాగుంటుంది.

ఎవరు ఈ నట్టానన్‌…థాయిలాండ్‌లోనే అతి పిన్న వయస్కురాలైన మేకప్‌ ఆర్టిస్టు నట్టానన్‌. మూడు సంవత్సరాల వయసులోనే నట్టనన్‌కు మేకప్‌పై ఆసక్తి ఉందని తల్లిదండ్రులు గుర్తించారు.

అందుకే ఆ పాపను చిన్నప్పటి నుండే ప్రొఫెషనల్‌ మేకప్‌ ఆర్టిస్టుగా తయారు చేసేందుకు ఆ దిశగా ట్రైనింగ్‌ ఇప్పించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ప్రొఫెషనల్‌ మేకప్‌ కోర్సులో జాయిన్‌ అయ్యింది. రెండు మూడు పదుల వయసు దాటిన వారు ఉన్న క్లాస్‌లో నట్టానన్‌ను అంతా కూడా విచిత్రంగా చూసేవారు.

అయితే పట్టుదలతో నట్టానన్‌ తాను అనుకున్నది సాధించింది. పదేళ్ల వయస్సులోనే ప్రొఫెషనల్‌ మేకప్‌ ఆర్టిస్టు అయ్యింది.

నట్టానన్‌ వద్దకు ప్రతి రోజు వందల సంఖ్యలో మేకప్‌ కోసం వస్తారట. వెడ్డింగ్‌ మేకప్‌, సినిమా మేకప్‌ ఇలా ఎన్నో రకాలుగా ఈ బాలిక మేకప్‌ వేస్తుంది.

12 ఏళ్ల వయసులోనే కోట్లలో ఈ అమ్మాయి సంపాదిస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్బంగా నట్టానన్‌ తన సంపాదనతో బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. మేకప్‌ ఆర్టిస్టు మాత్రమే కాకుండా నట్టానన్‌ యూట్యూబ్‌లో బ్యూటీ టిప్స్‌ చెబుతూ కూడా ఫేమస్‌ అయ్యింది. యూట్యూబ్‌ ద్వారా కూడా నెలకు లక్షల్లో నట్టాన్‌ సంపాదిస్తూ ఉంది..

చిన్న అమ్మాయి అయినా కోట్లు సంపాదించడం ఆశ్చర్యంగా ఉంది కదా, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక విషయమై ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను మనం వెలికి తీసుకుని, పదును పెడితే ఖచ్చితంగా నట్టానన్‌ స్థాయిలో కాకున్నా ఒక మోస్తరుగా అయినా సక్సెస్‌ అవ్వడం ఖాయం.