పెళ్లి కూతురిని లేపుకుపోయిన డైరెక్టర్

పెళ్లి పనులు జరుగుతూ ఉండగానో, పెళ్లి జరుగుతూ ఉండగానో, ప్రియుడు వచ్చి పెళ్లి కూతురిని లేపుకుపోవడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.సినిమాలో చేసేదాన్ని నిజంగా చేసి చూపించాడు తెలుగు దర్శకుడు.

 Bmr Director Sriram Adittya Eloped With His Love-TeluguStop.com

ఇంతకీ ఎవరా దర్శకుడు అనే కదా మీ ప్రశ్న.సుధీర్ బాబు హీరోగా వచ్చిన “భలే మంచి రోజు” చిత్రం గుర్తుందా ? మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమయ్యాడు శ్రీరాం ఆదిత్య.షార్ట్ ఫిలిమ్స్ తో ఆవార్డు పట్టేసి, తోలి చిత్రం భలే మంచి రోజుతో విమర్శకుల ప్రశంసలు కొట్టేసాడు ఈ కుర్ర దర్శకుడు

ఈ డైరెక్టర్ చాలాకాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమిస్తోంది.

ఈ నెల 17 ఆ అమ్మాయి పెళ్లి వేరే అబ్బాయితో ఫిక్స్ చేసేసారు.ఇంకేముంది .అచ్చం సినిమాల్లో లాగానే ముస్తాబవుతున్న పెళ్లి కూతురిని లేపుకుపోయాడు.ఆ నోటా, ఈ నోటా విషయం మీడియాకి తెలిసిపోయింది.

అయితే, మీడియాలో వినిపిస్తున్నట్లు , ఆ అమ్మాయి ఎవరో నిర్మాత కూతురు మాత్రం కాదు అని విశ్వసనీయవర్గాల సమాచారం.ఒక తెలుగు నిర్మాత ఇంటి దగ్గరే ఈ అమ్మాయి ఇల్లు ఉండటంతో , నిర్మాత కూతురు అని పొరబడినట్టున్నారు

పోలీసు కేసు వేయకుండానే, అమ్మాయి తల్లిదండ్రులు శ్రీరాం ఆదిత్య మరియు తమ అమ్మాయి కోసం గాలింపు మొదలుపెట్టారట.

ఈ ప్రేమ వ్యవహారం శ్రీరాం ఆదిత్య భవిష్యత్తుకి ఆటంకం కలిగించకుంటే చాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube