సోనూసూద్ అలాంటి వ్యక్తి.. బీఎంసీ సంచలన ఆరోపణలు..?  

గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ తరువాత లాక్ డౌన్ అమలైన సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సోనూసూద్ వారికి సహాయం చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ సోనూసూద్ వార్తల్లో నిలుస్తున్నారు.

TeluguStop.com - Bmc Calls Sonu Sood Habitual Offender Affidavit Court

సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూసూద్ ను ప్రజలు మాత్రం రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు.

అయితే ప్రజల దృష్టిలో మంచిపేరు సంపాదించుకున్న సోనూసూద్ పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఆరోపణలు చేసింది.

TeluguStop.com - సోనూసూద్ అలాంటి వ్యక్తి.. బీఎంసీ సంచలన ఆరోపణలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు అలవాటుగా మారిపోయిందని బీఎంసీ పేర్కొంది.సోనూసూద్ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నానని బీఎంసీ ఆరోపణలు చేసింది.అనుమతులు తీసుకోకుండా సోనూసూద్ నివాస సముదాయాన్ని హోటల్ గా మారుస్తున్నారని పేర్కొంది.

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్ కు శక్తిసాగర్ పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది.ఆ భవనాన్ని హోటల్ గా మార్చడంతో అధికారులు సోనూసూద్ కు నోటీసులు జారీ చేయగా సోనూసూద్ నోటీసులకు స్పందించకపోవడంతో బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే సోనూసూద్ మాత్రం తాను అనుమతులు తీసుకోవడంతో పాటు నిబంధనలు పాటించానని చెబుతున్నారు.

సోనూసూద్ బీఎంసీ అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సోనూసూద్ పిటిషన్ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరోవైపు సోనూసూద్ మాత్రం ఒకవైపు వరుసగా సినిమాల్లో నటిస్తూ మరోవైపు కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన అల్లుడు అదుర్స్ సినిమా రేపు విడుదల కానుంది.

ఇప్పటివరకు నెగిటివ్ పాత్రల్లో ఎక్కువగా నటించిన సోనూసూద్ ఇకపై పాజిటివ్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

#Sonusood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు