జుట్టు ఒత్తుగా పెరగటానికి,చర్మ సమస్యలకు.... బ్లూ బెర్రీలు       2018-05-16   22:16:58  IST  Lakshmi P

బ్లూ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఎక్కువగా సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. బ్లూ బెర్రీలు జుట్టు ఒత్తుగా పెరగటానికి బాగా సహాయపడుతుంది. బ్లూ బెర్రీలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు. బ్లూ బెర్రీలలో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన చర్మంపై వచ్చే ముడతలు,సన్నని గీతలు,వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

చర్మంలో పి హెచ్ బ్యాలెన్స్ ని చేయటంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేమగా,అందంగా వుండేలా చేస్తుంది. బ్లూ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ రంద్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. చర్మం అందంగా,ఆరోగ్యంగా ఉండాలంటే చర్మ రంద్రాలు తెరుచుకొని ఉండాలి. చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది.

ఒకవేళ మృతకణాలు పెరిగితే చర్మంపై పగుళ్లు వస్తాయి. బ్లూ బెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మృతకణాలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి చర్మం పగిలే సమస్య కూడా ఉండదు. చర్మ ఆరోగ్యాన్ని పెంచటానికి కూడా బాగా సహాయపడుతుంది. చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ పై పోరాడి, మీ చర్మాన్ని పునరుద్ధరించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

బ్లూ బెర్రీలలో విటమిన్ E సమృద్ధిగా ఉండుట వలన కంటి చుట్టూ నల్లటి వలయాలను తొలగించటంలో సహాయపడుతుంది. దాంతో కళ్ళు తాజాగా,ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ముఖం కూడా అందంగా చూడముచ్చటగా ఉంటుంది. బ్లూ బెర్రీలతో చేసిన హెయిర్ ప్యాక్ ను ఉపయోగిస్తే జుట్టు తొందరగా తెల్లగా మారదు. అంతేకాక జుట్టు ఒత్తుగా,బలంగా,పొడవుగా పెరుగుతుంది.