జెఫ్ బెజోస్ గీసిన బొమ్మల్ని కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లిన బ్లూ ఆరిజిన్..

Blue Origin Takes Jeff Bezos Drawn Pictures Into The Space

అమెజాన్‌ అధినేత జెఫ్బెజోస్‌ “బ్లూ ఆరిజిన్‌” అనే స్పేస్‌ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.ఇటీవల ఈ స్పేస్ ఏజెన్సీ ఓ రాకెట్‌ను సైతం రూపొందించి అంతరిక్షానికి విజయవంతంగా పంపించింది.

 Blue Origin Takes Jeff Bezos Drawn Pictures Into The Space-TeluguStop.com

దీనితో అంతరిక్ష ప్రయాణానికి ఒక ముందడుగు పడిందనే చెప్పాలి.బెజోస్‌ సామాన్య ప్రజలకు కూడా స్పేస్ టూరిజం సేవలు అందించాలనే లక్ష్యంతో వడివడిగా ముందుకు సాగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బ్లూ ఆరిజిన్‌ మరో మానవసహిత రాకెట్‌ను స్పేస్ లోకి పంపించింది.ఈ వ్యోమనౌకలో వ్యోమగాములతో పాటు కొన్ని బొమ్మలు కూడా స్పేస్ లో చక్కర్లు కొట్టి వచ్చాయి.

 Blue Origin Takes Jeff Bezos Drawn Pictures Into The Space-జెఫ్ బెజోస్ గీసిన బొమ్మల్ని కూడా స్పేస్‌లోకి తీసుకెళ్లిన బ్లూ ఆరిజిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బెజోస్‌ చిన్నతనంలో అంతరిక్షం గురించి కొన్ని బొమ్మలు గీశారు.ఆ బొమ్మలే తాజాగా అంతరిక్షంలోకి వెళ్లొచ్చాయి.

ఈ ఆసక్తికర విషయాన్ని బెజోస్‌ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.తన తొమ్మిదేళ్ల వయసులో స్టార్‌ట్రెక్‌ టీవీ సిరీస్‌లో యూజ్ చేసిన ట్రైకార్డర్స్‌, కమ్యూనికేటర్స్‌ను కాగితంపై గీసి వాటితో ఆడుకునేవాడినని బెజోస్‌ వివరించారు.

ఆ బొమ్మలను తన అమ్మ 48 సంవత్సరాలుగా సురక్షితంగా దాచిపెట్టిందని.అవి ఇటీవలే తన కంట పడ్డాయని బెజోస్‌ చెప్పుకొచ్చారు.వాటిని విలియమ్‌ శాంట్నర్‌ స్పేస్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించారని పేర్కొన్నారు.

Telugu Blue Orgin, Jeff Bezos, Jeff Bezos, Latest, Space, Space Tourism, Latest, William-Latest News - Telugu

తాజాగా బ్లూ ఆరిజిన్‌ చేపట్టిన అంతరిక్షయాత్రలో వెళ్లొచ్చిన సభ్యుల్లో విలియమ్‌ శాంట్నర్‌ కూడా ఒకరు.ఇతను 1966 కాలంలో బాగా పాపులర్ అయిన “స్టార్‌ట్రెక్‌” అనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ టీవీ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు.బెజోస్‌ ఆ సిరీస్‌ చూస్తూనే పెరిగారు.

ఆ సిరీస్ ఎపిసోడ్స్ చాలా ఇష్టంతో చూసేవారు.ఆ సిరీస్‌లో నటించిన నటీనటులపై ఎంతో అభిమానం పెంచుకున్నారు.

ఆ అభిమానంతోనే శాంట్నర్‌ను అంతరిక్షయానానికి పంపించారు.ఇప్పుడు అతని వయస్సు 90 సంవత్సరాలు.

దీంతో అంతరిక్షానికి వెళ్లిన అతి పెద్ద వయస్కుడిగా శాంట్నర్‌ అరుదైన రికార్డును నెలకొల్పారు.

#Space Tourism #William #Blue Orgin #Space #Jeff Bezos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube