గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బ్లూ ఆర్జిన్..!

ఆన్ లైన్ షాపింగ్ లో పేరుగాంచిన సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి.అలాంటి అమెజాన్ సంస్థ స్థాపకుడు అయిన జెఫ్‌ బెజోస్‌ ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే.2021 జులైలో జెఫ్ బెజోస్ తో పాటు కొంతమంది టీమ్ అంతరిక్షయానం చేసి సురక్షితంగా భూమ్మీదకు ల్యాండ్ అయ్యారు.ఆ తరువాత కొన్ని నెలలకు బ్లూ ఆరిజిన్ టీమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.

 Blue Origin Flight That Carries Jeff Bezos To Space Bags Guinness Record, Jeff B-TeluguStop.com

మళ్ళీ ఇప్పుడు తాజాగా బ్లూ ఆరిజిన్ మరొక నాలుగు రికార్డులను కూడా సంపాదించుకుంది.కాగా కార్మెన్ లైన్ పైన అంటే భూమికి 100 కి.మీ.పైన అంతరిక్ష నౌకలో నలుగురు ప్రయాణికులు మూడు నిముషాల పాటు ప్రయాణం చేసి మళ్ళీ సురక్షితంగా భూమికి తిరిగి రావడంలో బ్లూ ఆరిజిన్ విజయం సాధించింది.

ఈ అంతరిక్ష యానంలోకి వెళ్లినవారిలో 82 ఏళ్ల వాలీ ఫంక్, 19 ఏళ్ల ఆలివర్‌ వారితో పాటు జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ బెజోస్‌ ఉన్నారు.మళ్ళీ బ్లూ ఆరిజిన్ తదుపరి మిషన్‌ ప్రయాణం అక్టోబర్ 12 న జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.

మళ్ళీ ఈ మిషన్ భూమి నుంచి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి భూమి మీదకి తీసుకురానుంది.అయితే ఊరికే కాదండోయ్.డబ్బులకు టికెట్స్ కొనుక్కోవాలి.

Telugu Amazon Founder, Blue Origin, Blueorigin, Guinness, Jeff Bezos, Mark, Spac

అలాగే అంతరిక్షయానం చేసి భూమ్మీదకు వచ్చిన తరువాత జెఫ్ బెజోస్ ఇలా చెప్పుకొచ్చారు.అదొక అత్యద్భుతమైన ప్రయాణంలా నాకు అనిపించింది అని, ఈరోజు నాకు చరిత్రలో ఒక మర్చిపోలేని అత్యుత్తమమైనరోజు అని అన్నారు.ఇలా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన 571వ వ్యోమగామిగా జెఫ్ బెజోస్ పేరు గాంచారు.

అలాగే వారితో పాటు అంతరిక్ష ప్రయాణం చేసిన అతి చిన్న వయసు గల 19 ఏళ్ల ఆలివర్‌ డేమన్ అంతరిక్షానికి వెళ్లిన అతి చిన్నవయస్సు గలవాడిగా రికార్డుకెక్కాడు.చేశాడు.

అయితే డెమన్ 28 మిలియన్ల డాలర్లు చెల్లించి మరి అంతరిక్షయానం చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube