ఆ ట్రాఫిక్ లైట్లలో నీలిరంగు దేనికి సంకేతమో తెలుసా?

సాధారణంగా నగరాలు పట్టణాలలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దర్శనమిస్తుంటాయి.మన వాహనాలు ఎంత స్పీడ్ గా వెళ్తున్నప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఎరుపు రంగు పడితే కచ్చితంగా ఆగి పోవాల్సిందే.

 Japan,blue Light,traffic Light,international Traffic Laws,avo-TeluguStop.com

ఈ విషయం మనందరికీ కూడా తెలుసు.సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎరుపు, పసుపు, ఆకుపచ్చ సిగ్నల్ లైట్లను చూసి ఉంటారు.

కానీ జపాన్ దేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆకుపచ్చ రంగు బదులుగా నీలి రంగు ఉంటుంది.అలా నీలి రంగును పెట్టడానికి గల కారణం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం…
కొన్ని శతాబ్దాల క్రితం జపాన్ దేశంలో కేవలం నాలుగు రంగులు మాత్రమే ఉండేవి అవి ఎరుపు, నీలం, ఆకుపచ్చ,తెలుపు.

అయితే జపాన్ లో ఈ రంగులకు మరొక పేర్లు కూడా ఉండేవి.ఆకుపచ్చ రంగుని , నీలి రంగులు జపాన్ దేశంలో “అవో” అనే పేరుతో పిలిచేవారు.

తరువాత ఆకుపచ్చ రంగుకు “మడోరి”అనే పేరును పెట్టినప్పటికీ, జపాన్లో ఇప్పటికి కూడా ఆకుపచ్చరంగును “అవో”పిలుస్తారు.

Telugu Blue, Japan-Latest News - Telugu

1968 వ సంవత్సరంలో ట్రాఫిక్ సిగ్నల్ పై నిర్వహించిన వియన్నా సదస్సులో అన్ని దేశాలు ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆకుపచ్చ రంగు ను వాడాలని నిర్ణయించారు.కానీ అన్ని దేశాలతో పాటు జపాన్ కూడా ఆకుపచ్చ రంగును ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాడుతున్నప్పటికీ అధికారికంగా అన్ని పత్రాలలో మడోరి కి బదులుగా అవో అని రాసుకొచ్చారు.ఆకుపచ్చ రంగుకు మడోరి అనే పేరు ఉన్నప్పటికీ ,అవో గా రాయడంతో, దీనిపై జపాన్ భాషావేత్తలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ మండిపడ్డారు.

ఇలా అభ్యంతరం తెలపడంతో ఈ విషయంపై జపాన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.అంతర్జాతీయ ట్రాఫిక్ చట్టాలను మీరకుండా, జపనీయుల మనోభావాలు దెబ్బతినకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ లో చూడడానికి ఆకుపచ్చరంగులో ఉన్నప్పటికీ అవి నీలిరంగులో ఉండేలా ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసింది.1973 నుంచి ఈ ఆక్వా నీలి రంగును ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాడాలని అనుమతి తెలిపింది అప్పటి నుంచి జపాన్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎరుపు, పసుపు, ఆక్వా బ్లూ రంగులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube