కేక్ పై క్యాండిల్స్ పెట్టి ఊదకూడదు.. ఎందుకో తెలుసా?

ఒకప్పుడు పుట్టిన రోజు వచ్చిందంటే ఇంట్లో అమ్మతో పాయసం చేయించుకొని అందరికి పంచి పెట్టేవాళ్ళు.ఆతర్వాత కాలంలో చాక్లెట్స్ తీసుకొని అందరికి పంచేవాళ్ళు.

 Blowing Out Birthday Candles Increases Cake Bacteria, Birthday Candles, Blowing-TeluguStop.com

కొంతకాలానికి పాయసం, చాక్లెట్స్ పోయి స్వీట్స్ వచ్చాయి.స్వీట్స్ డబ్బా తీసుకొని వెళ్లి అందరికి స్వీట్స్ ఇచ్చి పుట్టినరోజు చేసుకునే వారు.10 మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కేక్ కట్ చేసేవాళ్లు.

కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పుట్టినరోజు అంటే కేక్ కట్ చెయ్యడం కామన్ అయిపొయింది.

అయితే కేక్ లో క్యాండిల్స్ కూడా ఉంటున్నాయి.ఇక కేక్ కట్ చెయ్యాలి అంటే క్యాండిల్ ఊదడం ఓ ఆనవాయితీ అయిపొయింది.

కానీ అలా క్యాండిల్స్ ఊదే సమయంలో ఎంతోమంది అలా ఊదకూడదని, మంచిదికాదని చెప్తుంటారు.కేవలం వారు మాత్రమే కాదు నిపుణులు కూడా కేక్ పై క్యాండిల్ ఊదడం మంచిది కాదని సూచిస్తున్నారు.

కేక్ పై క్యాండిల్స్ ఊదడం వల్ల వారి నోటిలో ఉండే లాలాజలం కేక్ పై పడే అవకాశం ఉందని.సాధారణంగానే లాలాజలంతో బ్యాక్టీరియా ఉంటుందని అదే బ్యాక్టీరియా కేక్ పై పడిన వెంటనే కేక్ మొత్తం వ్యాపిస్తుందని వారు చెప్తున్నారు.

కేక్ పై క్యాండిళ్లను ఊదిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమస్య ఉండదని అదే ఏమైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం ఆ వ్యక్తి నుంచి అందరికి రోగాలు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.అంతేకాదు ప్రస్తుత కాలంలో క్యాండిల్స్ ఊదే సంప్రదాయాన్ని విడిచి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube