గోడ నుండి కారుతున్న రక్తం... ఫ్లాట్ కు వెళ్లి గజగజా వణికిన యువకుడు..!

సాధారణంగా హర్రర్ సినిమాల్లో గోడకు మేకు కొడితే రక్తం రావడం, గోడలో శవాలు ఉండటంలాంటి సన్నివేశాలు చూసి ఉంటాం.నిజ జీవితంలో ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

 Blood Leaking From Apartment Ceiling-TeluguStop.com

కానీ అమెరికాలో ఒక గోడ నుండి మాత్రం గోడకు మేకు కూడా కొట్టకుండానే రక్తం కారింది.గోడ నుండి రక్తం ఎందుకు కారుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించిన యువకుడు అసలు విషయం తెలిసి గజగజా వణికిపోయాడు.

పూర్తి వివరాలలోకి వెళితే అమెరికాలో ఒక యువకుడు తన స్నేహితునితో కలిసి ఫ్లాట్ లో నివశిస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం నుండి గోడ నుండి ఎర్రటి రంగులో దుర్వాసనతో కూడిన ఒక ద్రవం కారడం గమనించాడు.

ఆ ద్రవం ఏమిటో తెలుసుకోవాలని యువకుడు ప్రయత్నించినా ఆ ద్రవం ఏంటో అతనికి అర్థం కాలేదు.ఆ తరువాత యువకుడు పరిశీలించగా రక్తం గోడ నుండి కారడం లేదని సీలింగ్ నుండి కారుతోందని యువకుడు గుర్తించాడు.

ఆ యువకుడు తన ఫ్లాట్ లో మాత్రమే ఇలా లీకేజీ జరుగుతోందా…? పై ఫ్లాట్ లో కూడా ఇదే విధంగా జరుగుతోందా.? అని తెలుసుకోవడానికి ప్రయత్నించగా పై ఫ్లాట్ బెడ్ రూమ్ లో యువకునికి శవం కనిపించింది.ఆ తరువాత యువకుడు పోలీసులకు శవానికి సంబంధించిన సమాచారం అందించాడు.చెక్క ఇళ్లలో ఇలాంటి లీకేజీలు ఏర్పడతాయని సీలింగ్, గోడ మధ్య ఉండే ఖాళీ నుండి రక్తం లీకైందని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube