శరీరంలో రక్తం బాగా సరఫరా అవ్వాలంటే ఏమి చేయాలి  

మనిషి శరీరంలో సుమారు 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. శరీరం బరువులో రక్తం బరువు 7 శాతం వరకు ఉంటుంది. అయితే రక్తం పరిమాణం అందరిలోనూ ఒకేలా ఉండదు. మనిషి యొక్క ఆడ, మగ, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితిని బట్టి రక్తం యొక్క పరిమాణం ఉంటుంది. శరీరంలో అన్ని పనులు సక్రమంగా జరగటంతో రక్తం కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

రక్తం సరఫరా శరీరంలో సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. రక్త సరఫరా సరిగా లేకపోతే ఆకలి లేకపోవడం, పాదాలు, చేతులు మొద్దుబారిపోయి స్పర్శ లేనట్లు అనిపించడం, జీర్ణ సమస్యలు రావడం, త్వరగా అలసి పోవడం, చర్మం రంగు మారడం, రక్త నాళాలు ఉబ్బిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి శరీరంలో రక్తం సరఫరా బాగా అయ్యేలా చూసుకోవాలి.

Blood Circulation Increase Tips-

Blood Circulation Increase Tips

రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీటిని త్రాగాలి. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఎ, బి, సి, ఇ, మెగ్నిషియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రక్త సరఫరా బాగా అయ్యేలా చేస్తాయి. ప్రతి రోజు గ్రీన్ టీ త్రాగాలి.

ప్రతి రోజు రెండు రెబ్బలు వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి రక్త సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి.