గ్రేట్‌ : కళ్లు, చెవులు లేకున్నా 130 దేశాల్లో విహార యాత్ర చేశాడు

కళ్లు మూసుకుని అయిదు నిమిషాల పాటు రెగ్యులర్‌ వర్క్‌ చేసుకోలేని పరిస్థితి.కళ్లు లేకుండా కనీసం పక్క రూం కు కూడా వెళ్లలేం.

 Blind And Deaf British Backpacker Visits 130 Countries Tony Girls-TeluguStop.com

అలాంటిది అమెరికాకు చెందిన టోనీ గైల్స్‌ కళ్లు చెవులు లేకున్నా ఏకంగా 130 దేశాల్లో పర్యటించాడు.అతడు పర్యటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఒంటరిగా ఆయన ఇన్ని దేశాలను ఎలా చుట్టేశాడో అంటూ అంతా అవాక్కవ్వడం ఖాయం.అన్ని అవయవాలు బాగున్న వారు కూడా కొత్త ప్రదేశంకు వెళ్లినప్పుడు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అలాంటిది కొత్త దేశంకు వెళ్లినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Telugu Blinddeaf, Telugu Ups, Tony Gails-Inspirational Storys

  టోనీ గైల్స్‌ మాత్రం 130 దేశాలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టేశాడు.15 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో విపరీతమైన తాగుడుకు అలవాటైన టోనీ ఆ తర్వాత కొన్నాళ్లకు తాగుడు నుండి బయటకు వచ్చాడు.చిన్నతనంలోనే కళ్లు మరియు చెవులు పని చేయక పోవడంతో అతడితో స్నేహం చేసేందుకు ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించేవారు కాదు.

అందుకే అతడు అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాలను ఒంటరిగా చుట్టేయాలనుకున్నాడు.కొద్ది సమయంలోనే అమెరికాలోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాల్లో ఉన్న ప్రముఖ టూరింగ్‌ ప్రదేశాలను చుట్టేశాడు.

Telugu Blinddeaf, Telugu Ups, Tony Gails-Inspirational Storys

  అమెరికా పూర్తి అయిన తర్వాత అతడు ఇతర దేశాలపై దృష్టి సారించాడు.తండ్రికి వచ్చే పెన్షన్‌ డబ్బులతో విదేశీ పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నాడు.ప్రతి సంవత్సరం నాలుగు అయిదు దేశాలైనా పర్యటించడం టోనీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.టికెట్స్‌ బుకింగ్‌ ఇతరత్ర విషయాల్లో టోనీ తల్లి హెల్ప్‌ చేసేది.ఆమె సాయం తీసుకుని విమాన టికెట్లు బుక్‌ చేసుకునే టోనీ ఆ తర్వాత అంతా సొంతంగానే ముందుకు సాగేవాడు.ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో కరెన్సీ సమస్య వచ్చేది.

అలా కరెన్సీ ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఎవరో ఒకరు మంచి మనసుతో నాకు సాయం చేసే వారు అంటూ టోనీ చెప్పుకొచ్చాడు.

Telugu Blinddeaf, Telugu Ups, Tony Gails-Inspirational Storys

  యూఎస్‌ డాలర్ల నుండి ఆ దేశపు కరెన్సీని మార్చుకునే విషయంలో ప్రతి సారి స్థానికంగా ఎవరిదో ఒకరి హెల్ప్‌ తీసుకోవడంతో పాటు అక్కడ చూడదగ్గ ప్రదేశాలు మరియు ఇతరత్ర విషయలను కూడా స్థానికులను అడిగి తెలుసుకునే వాడు.ఖరీదైన హోటల్స్‌లో కాకుండా సాదారణంగా ఉండే హోటల్స్‌లో బసచేయడంతో పాటు, సాదారణ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటాడు.విదేశాలకు వెళ్లిన సమయంలో మద్యంకు దూరంగా ఉంటానని చెప్పాడు.

తాను వెళ్లిన పర్యటక ప్రదేశంలో శ్వాస ద్వారా మరియు టచ్‌ చేయడం ద్వారా ఆ ప్రదేశాన్ని ఆశ్వాదిస్తానంటూ టోనీ చెబుతున్నాడు.తన ప్రతి దేశం పర్యటనకు సంబంధించిన వివరాలను తాను సొంతంగా నడుపుతున్న ఒక వెబ్‌ సైట్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది.

ఆ వెబ్‌ సైట్‌కు కూడా మంచి ఆధరణ ఉందని టోనీ చెబుతున్నాడు.కళ్లు కనిపించకున్నా, చెవులు వినిపించకున్నా ఇన్ని దేశాలు పర్యటించడం అంటే మామూలు విషయం కాదు.

అందుకే టోనీ గైల్స్‌ ఈజ్‌ గ్రేట్‌ మన్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube