జాగ్రత్త.... ముందుంది మండే కాలమేనట

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బద్దలు అవుతున్నాయి.భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

 Blazing Sunny Effect In Telugu States-TeluguStop.com

ఎండలు మరింత మాడిపోతాయని ఆర్టీజీఎస్ తెలిపింది.ముందు ముందు ఉండేది ఎండా కాలం కాదు పూర్తి గా మండే కాలమే అని చెబుతున్నారు.

దీనితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.అందులోనూ గాలిలో తేమ శాతం తగ్గిపోవడం తో ఇంత తీవ్ర స్థాయిలో ఎండలు మండుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పడమర,వాయువ్య దిశ నుంచి వేడిగాలులు వీస్తున్నాయి.రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూడా వేడి గాలులు వీస్తుండడం విశేషం.

ఈ తీవ్ర వడ గాలుల వల్ల ప్రజలు త్వరగా అనారోగ్యం పాలవుతారని అందుకే అందరూ ఎక్కువగా ద్రవ పదార్ధాలను తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు
రోహిణి కార్తీ రాకముందే మండిపోయే ఎండలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.దీనితో బయటకి రావడానికి జనాలు భయపడుతున్నారు.

ఈ నెల 10 వరకు తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని సమాచారం.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.

మధ్యాహ్నం సమయంలో ఈ ఎండ తీవ్రత మరింత గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.దీనితో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube