'అఖండ' 20 రోజుల్లో చుట్టేసే ప్రయత్నం చేస్తున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా చిత్రీకరణ చివరి దశలో ముగిసింది.ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా ను నెల రోజుల పాటు షూటింగ్‌ చేయాల్సి ఉందట.

 Hero Blakrishna And Boyapati Movie Akhanda Shooting Update  , Akhanda Movie, Akh-TeluguStop.com

మొదట ప్లాన్‌ చేసిన దాని ప్రకారం బ్యాలన్స్ వర్క్‌ పూర్తి అవ్వడానికి నెల సమయం పడుతుంది.కాని ఈ పరిస్థితుల్లో షూటింగ్‌ విషయంలో కాంప్రమైజ్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో నెల రోజుల్లో చేయాల్సిన షూటింగ్ ను 20 రోజుల్లో చుట్టేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే షూటింగ్ విషయంలో బోయపాటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది తెలియాల్సి ఉంది.కేవలం హైదరాబాద్‌ లోనే కాకుండా ఈ సినిమా చిత్రీకరణ ను ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాల్సి ఉంది.

కడపతో పాటు కొన్ని ఛారిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరణ రెండు మూడు రోజుల చొప్పున చిత్రీకరిస్తారట.ఇంతగా వర్క్ ఉన్నా కూడా 20 రోజుల్లోనే ఎలా పూర్తి చేస్తావు బోయపాటి అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

షూటింగ్‌ ను సరిగ్గా పూర్తి చేయాలని.చుట్టేసే ప్రయత్నం అస్సలు చేయవద్దంటూ బోయపాటికి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.బోయపాటి మాత్రం ఇప్పటికే అఖండ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు చేశాడు.18 నుండి 20 రోజుల్లోనే పూర్తి చేసే వీలుగా డేట్లను తీసుకున్నాడు.బాలకృష్ణ కేవలం 15 రోజులు మాత్రమే షూటింగ్‌ లో పాల్గొంటాడట.దాంతో సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేస్తారని అంటున్నారు.

Telugu Akhanda, Akhanda Regular, Balakrishna, Boyapati Srinu, Poorna, Pragya Jai

షూటింగ్‌ విషయంలో అనేక పుకార్లు పుట్టుకు వస్తున్న నేపథ్యం లో సినిమా ఎప్పుడు విడుదల ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో షూటింగ్‌ ను పూర్తి చేసి థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయడం బెటర్‌ నిర్ణయంగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.మిర్యాల రాజేందర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా లో పూర్ణ మరియు ప్రగ్యా జైస్వాల్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube