వైరల్ వీడియో: రెండేళ్ల దివ్యాంగుడిని ఇన్స్పైర్ చేసిన బ్లేడ్ రన్నర్.. ఎలా అంటే..?!

రెండేళ్ల బాలుడికి మరియు పారాలింపిక్స్‌ లో ఎనిమిది సార్లు పతకాలు సాధించిన బ్లేక్ లీపర్ కి మధ్య ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.బ్లేక్ తనలాగా కాళ్లు లేని రెండేళ్ల బాలుడిని ప్రోత్సహించి నడిచేలా చేశాడు.

 Blade Runner, Support, Tokyo Olympics, Sports, 2 Years Boy, Viral, Telugu Viral-TeluguStop.com

అయితే బ్లేక్ రెండేళ్ల బాలుడు నడవడానికి సహాయం చేసిన దృశ్యాలను చిత్రీకరించి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.

ఈ రెండేళ్ల బాలుడికి ఇటీవలే ప్రొస్తెటిక్ కాలును వైద్యులు అమర్చగా.

ఆ చిన్నారి బ్యాలెన్స్ చేసుకోలేక బాగా ఇబ్బంది పడిపోయాడు.దీంతో కృత్రిమ పాదంతో ఎలా నడవాలో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తూ రెండేళ్ల బాలుడిలో ప్రోత్సాహం నింపాడు బ్లేక్.

ఆ బాలుడు బ్లేక్ ని చూస్తూ బ్యాలెన్స్ వాకర్ సహాయం తో ముందు అడుగులు వేసాడు.దీంతో అక్కడే ఉన్న ఆ బాలుడి తల్లి బాగా సంతోషించింది.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం తో నెటిజన్లు బ్లేక్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.బ్లేక్‌తో పాటు ఆ బాలుడి చేసిన ప్రయత్నాన్ని కూడా తెగ మెచ్చుకుంటున్నారు.

అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ బ్లేక్ యొక్క వీడియోని షేర్ చేసి బాలుడికి సహాయం చేస్తున్న ఛాంపియన్ అనే కాప్షన్ యాడ్ చేశారు.ఇదిలా ఉండగా 2021లో జరగబోతున్న టోక్యో ఒలింపిక్స్ కోసం బ్లేక్ ప్రిపేర్ అవుతున్నాడు.ఆయన కృత్రిమ కాళ్ల తోనే పరిగెత్తారు కాబట్టి ప్రిపేర్ కావడానికి కొత్త కృత్రిమ లెగ్గు లను కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి రెండేళ్ల బాలుడు కనిపించాడు.అయితే ఆ రెండేళ్ల బాలుడు నడవడానికి బాగా ఇబ్బంది పడి పోతూ ఉండడంతో బ్లేక్ బాలుడికి కృత్రిమ పాదాలతో ఎలా నడవాలో చూపించారు.

ఆ విధంగా చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఫిదా చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube