గుండె జ‌బ్బుల‌ను దూరం చేసే‌ బ్లాక్ టీ.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

నేటి కాలంలో చాలా మంది గుండె జ‌బ్బుల‌తో ప్రాణాల‌ను విడుస్తున్నారు.శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో.

 Black Tea Prevents From Heart Diseases-TeluguStop.com

వెంట‌నే గుండె జ‌బ్బులు ఎటాక్ చేస్తూ ఉంటాయి.అయితే గుండె జ‌బ్బుల‌ను దూరం చేయ‌డంలో బ్లాక్ టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

సాధార‌ణంగా ఉద‌యం చాలా మందికి టీ తాగే అల‌వాటు ఉంటుంది.ఉద‌యం లేవ‌గానే ఓ క‌ప్పు టీ తాగ‌నిదే చాలా మందికి రోజు కూడ గ‌డ‌వ‌దు.

 Black Tea Prevents From Heart Diseases-గుండె జ‌బ్బుల‌ను దూరం చేసే‌ బ్లాక్ టీ.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టీలో చాలా ర‌కాలు ఉన్నాయి.అయితే కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించే వారు మాత్రం గ్రీన్ టీ, బ్లాక్ టీ సేవిస్తుంటారు.

ముఖ్యంగా బ్లాక్ టీ విష‌యానికి వ‌స్తే.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక శాతం మంది బ్లాక్ టీను ఇష్టంగా తాగుతుంటారు.బ్లాక్ టీని తాగ‌డం వల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫ‌లితంగా గుండె సంబంధిత స‌మ‌స్యల‌ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఈ క‌రోనా కాలంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల అందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని అద్భుతంగా మెరుగుప‌రుస్తుంది.

ఇక అధిక బ‌రువుతో బాధ ప‌డుతున్న‌వారికి బ్లాక్ టీ బెస్ట్ అప్ష‌న్.ప్ర‌తి రోజు రెండు క‌ప్పుల బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతార‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో దాదాపు అంద‌రూ ఒత్తిడికి గుర‌వుతున్నారు.అయితే రెగ్యుల‌ర్‌గా బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో పాటు త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.

అదేవిధంగా, ఈ శీతాకాలంలో చాలా మంది అలెర్జీ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారు బ్లాక్ టీ తాగితే.

అలెర్జీల‌కు దూరం ఉండొచ్చు.అలాగే బ్లాక్-టీ అనేది కాల్షియంకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

కాబ‌ట్టి, రోజుకు ఒక‌టి లేదా రెండు క‌ప్పులు బ్లాక్ టీ తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు బ‌లంగా మార‌తాయి.

#Tips #Black #Heart Diseases #Heart #Benefits Black

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు