ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌కు న‌ల్ల మిరియాల‌తో చెక్ పెట్టండిలా!

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో జీవం పోసుకున్న అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను చుట్టు ముట్టేసిన సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు.

 Black Pepper Helps To Get Rid Of Cold And Cough-TeluguStop.com

ఇక ఓవైపు క‌రోనా.మ‌రోవైపు వ‌ర్షాకాలం కావ‌డంతో.

జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు చాలా మందిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.

 Black Pepper Helps To Get Rid Of Cold And Cough-ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల‌కు న‌ల్ల మిరియాల‌తో చెక్ పెట్టండిలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే న‌ల్ల మిరియాలు ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అదెలానొ ఇప్పుడు తెలుసుకుందాం.ద‌గ్గు, గొంతు నొప్పితో బాధ‌ప‌డేవారు న‌ల్ల మిరియాల‌ను పొడి చేసి.

గోరు వెచ్చ‌ని నీటిలో క‌లుపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా ద‌గ్గు, గొంతు నొప్పి త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే ఒక గ్లాసు గోరు వ‌చ్చిని పాల‌లో న‌ల్ల మిరియాల పొడి, తేనె క‌లిపి.ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు స‌మ‌స్య దూరం అవుతుంది.జ్వ‌రంతో బాధ‌ప‌డేవారు న‌ల్ల మిరియాల‌తో త‌యారు చేసిన సూప్‌ను తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల జ్వ‌రం క్ర‌మంగా త‌గ్గుతుంది.ఇక న‌ల్ల మిరియాల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా న‌ల్ల మిరియాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.న‌ల్ల మిరియాల‌ను రోజు ఏదో ఒక విధంగా తీసుకుంటే.శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న అద‌న‌పు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.అలాగే ఉద‌యాన్ని మిరియాల టీ తాగితే.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని న‌ల్ల మిరియాల‌ను ఎక్కువ‌గా మాత్రం తీసుకోకూడ‌దు.

న‌ల్ల మిరియాల‌ను అతిగా తీసుకుంటే అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

#Home Remedies #Health Tips #Cold #Black Pepper #Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు