పసుపు + మిరియాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  

  • పసుపును మన ఇంటిలో ప్రతి రోజు వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే పసుపును మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు. పసుపు కారణంగా వంటలకు మంచి రంగు,రుచి వస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది. ఇక మిరియాల విషయానికి వస్తే మిరియాలతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పసుపు,మిరియాలను కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

  • -

  • పసుపు,మిరియాలను కలిపి ప్రతి రోజు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాక క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది.

  • ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చికికేడు పసుపు,మిరియాల పొడిని కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులను తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

  • పసుపు,మిరియాల కాంబినేషన్ రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించి మధుమేహంను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు కక్రమం తప్పకుండా పసుపు,మిరియాల పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

  • బరువు తగ్గాలని అనుకొనే వారికి ఈ కాంబినేషన్ మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిట్లో అరస్పూన్ పసుపు,అరస్పూన్ మిరియాల పొడి కలిపి పరగడుపున త్రాగితే శరీరంలో కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు.