అరుదైన దృశ్యం: బ్లాక్ పాంథర్,చిరుత ఒకే ఫొటోలో!

మోగ్లీ సినిమాలో కనిపించిన బ్లాక్ పాంథర్ గత కొద్దీ రోజులుగా కర్ణాటక అడవుల్లో కనిపించి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అలాంటి బ్లాక్‌ పాంథర్‌ ఫోటోలు నిజమే కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 Photographer, Black Panther, Leopard Photos,-TeluguStop.com

సినిమాల్లో కల్పిత జంతువు అయినా ఇది నిజంగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇంకా తాజాగా ఇప్పుడు బ్లాక్‌ పాంథర్‌, చిరుత పులి జతకట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంకా ఆ ఫోటోలను వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ మిథున్‌ హెచ్‌‌ తన కెమెరాలో క్లిక్ మనిపించాడు.ఇంకా ఆ ఫోటోలను మూడు రోజుల క్రితం షేర్‌ చేశాడు.

అయితే ఈ ఫొటోల ‍క్రెడిట్‌‌కు సంబంధించి వివాదానికి దారి తియ్యగా అది త్వరగానే ముగిసింది.

ఈ ఫొటోలను గత ఏడాది మిథున్‌ హెచ్‌ కర్ణాటకలోని కబిని ఫారెస్ట్‌లో తీశాడు.

కర్నాటకలో అంత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల అడవుల్లో ఇది ఒకటి. ”ది ఎటర్నల్‌ కపుల్‌.

సాయా(బ్లాక్‌ పాంథర్‌), క్లియోపాత్ర(చిరుత పులి) చూడండి” అంటూ ఆ ఫోటోలను షేర్ చేశాడు.దీంతో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి.

ఇంకా ఇది అరుదైన దృశ్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓసారి ఈ ఫోటోలను షేర్ చేసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube